యాపిల్ అదిరిపోయే డీల్.. ఏకంగా రూ.23 వేల తగ్గింపు..!

Buy iPhone 11 for RS 34900, Know How To Get This Deal - Sakshi

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలని చూస్తున్నారా? అయితే,  మీకు ఒక శుభవార్త. ప్రముఖ మొబైల్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ 11 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్ మీద భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ సిరీస్ మొబైల్స్ మీద ఏకంగా రూ.15 వేల తగ్గింపు ప్రకటించింది. ఐఫోన్ 11 సిరీస్ అసలు ధర కంటే రూ.15 వేలు తక్కువకు లభించాలంటే మీ దగ్గర ఉన్న పాత ఐఫోన్ 7 సిరీస్ మొబైల్ ఎక్స్ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ఐఫోన్ 13 సిరీస్ మీద రూ.23 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 13 మొబైల్ అసలు ధర కంటే రూ.15 వేలు తక్కువకు లభించాలంటే మీ దగ్గర ఉన్న పాత ఐఫోన్ 10ఆర్ సిరీస్ మొబైల్ ఎక్స్ఛేంజ్ చేయాల్సి ఉంటుంది.

అయితే, ఈ రెండు ఆఫర్స్ కూడా కేవలం ఇండియాస్టోర్ మాత్రమే లభిస్తున్నాయి. ఐఫోన్ 11 64జీబీ స్టోరేజీ అసలు ధర రూ.49,900 అయితే, ఇండియాస్టోర్ నెట్ వర్క్ స్టోర్లలో మీరు దీనిని రూ. 34,900 వరకు పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు ద్వారా ఈఎమ్ఐ విధానంలో కొనుగోలు చేసినట్లయితే అసలు ధర కంటే రూ.4,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంటే, మొబైల్ ధర రూ.45,900కు తగ్గుతుంది. అయితే, మీ దగ్గర పాత ఐఫోన్ 7 128 జీబీ మోడల్ ఉంటే ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ రూపంలో రూ.11,000 తక్కువకు మొబైల్ పొందవచ్చు. అంటే, మొత్తంగా ధర రూ.34,900కు తగ్గుతుంది.

అలాగే, మీరు ఐఫోన్ 13 సిరీస్ మొబైల్ కొనాలని చూస్తుంటే? దాని అసలు ధర రూ.1,29,900గా ఉంది. మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు ద్వారా ఈఎమ్ఐ విధానంలో కొనుగోలు చేసినట్లయితే అసలు ధర కంటే రూ.5,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంటే, మొబైల్ ధర రూ.1,24,900కు తగ్గుతుంది. అయితే, మీ దగ్గర పాత ఐఫోన్ 10ఆర్ 64 జీబీ మోడల్ ఉంటే ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో రూ.18,000 తక్కువకు మొబైల్ పొందవచ్చు. అంటే, మొత్తంగా ధర రూ.1,06,900కు తగ్గుతుంది. 

(చదవండి: క్రిప్టో కరెన్సీ దెబ్బకు విలవిల్లాడుతున్న ఇన్వెస్టర్లు..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top