బుగ‌ట్టి నుంచి మ‌రో స్పోర్ట్స్ కార్‌, ధ‌ర‌ రూ.100కోట్లు

Bugatti release sports car La Voiture Noire With Near Rs 100 Crore Price Tag - Sakshi

పారిస్ : ఫ్రాన్స్ కు చెందిన ప్ర‌ముఖ కార్ల సంస్థ బుగట్టి త‌న లేటెస్ట్ కార్ (ల వొఇతురు నిర్)ను మార్కెట్ లో విడుద‌ల చేసింది.రూ.100కోట్ల విలువైన కారును త‌యారు చేసేందుకు 60వేల గంట‌ల స‌మ‌యం ప‌ట్టింద‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. ఫ్రెంచ్ భాష‌లో ల వొఇతురు నిర్ అని పిలిచే ఈ కారును ఇంగ్లీష్ లో  ద బ్లాక్ కార్ అని పిలుస్తారు. 

ఈ కారు ప్ర‌త్యేక‌త‌ల్ని ఒక్క‌సారి గ‌మ‌నిస్తే క్వాడ్ ట‌ర్బో ఛార్జింగ్‌, 1,479 గంట‌ల హార్స్ ప‌వ‌ర్‌, 8 లీట‌ర్ల పెట్రోల్ డ‌బ్ల్యూ-16 పిస్ట‌న్ ఇంజిన్ సామ‌ర్ధ్యాన్ని క‌లిగి ఉంది. అయితే  బెస్పోక్ డిజైన్ మరియు ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్ దీనికి భిన్నంగా ఉంటాయి. బ్లాక్ క‌ల‌ర్ స్పోర్ట్స్ కారు.  కారు నాలుగు చక్రాల వెనుక భాగంలో 6 బ్లేడ్ ఎక్సహౌస్ ను కలిగి ఉంది.  ఈ 6బ్లేడ్ ఎక్స హౌస్ లు వేగాన్ని ఆస్వాధించేలా చేస్తోంది.  కారు టాప్ కార్బన్ ఫైబర్ బ్లాక్ క‌ల‌ర్ కోటింగ్ ను క‌లిగి ఉంది.

నివేదికల ప్రకారం, లా వోయిచర్ నోయిర్ ప్రతి అల్ట్రా-వైడ్లైట్ స్ట్రిప్స్‌లో 25  యూనిట్ల అత్యంత శక్తివంతమైన ఎల్‌ఇడి బల్బులను కలిగి ఉంది. కారు ముందు గ్రిల్‌లో 3-డి ప్రింటెడ్ సౌక‌ర్యం కలిగి ఉంది. కారు పొడ‌వు 17.7 కాగా, వీల్‌బేస్ 9.8 అంగుళాలు ఇప్పటివరకు కారు క్యాబిన్ ఫోటోలు విడుదల చేయకపోయినా హవానా బ్రౌన్ లెద‌ర్ తో  సీట్లను డిజైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top