ఆటో పరిశ్రమపై కురవని వరాల జల్లు | Budget 2024 Has no Benefit For Auto Industry | Sakshi
Sakshi News home page

Budget 2024-25: ఆటో పరిశ్రమపై కురవని వరాల జల్లు

Jul 23 2024 5:10 PM | Updated on Jul 23 2024 5:12 PM

Budget 2024 Has no Benefit For Auto Industry

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులో విద్య, వైద్యం, డిఫెన్స్ మొదలైన రంగాలకు వేలకోట్లు కేటాయించారు. కాగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి ముఖ్యమైన ప్రకటనలు లేకపోవడం గమనార్హం.

భారతదేశంలో ఆటోమొబైల్ రంగం వేగంగా విస్తరిస్తోంది, ఇది ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా నిలిచింది. ఈ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని, పరిశ్రమను మరింతగా పెంచేందుకు అనేక ప్రకటనలను ఉండొచ్చని నిపుణులు భావించారు. అయితే ఈ బడ్జెట్‌లో అలాంటి ప్రకటనలేవీ లేదు.

బడ్జెట్‌లో ఫేమ్ 3 సబ్సిడీ గురించి ఎలాంటి ప్రకటన లేదు. అంతే కాకుండా హైబ్రిడ్ వాహనాలపై పన్ను తగ్గింపులకు సంబంధించి కూడా ఎటువంటి ప్రకటనలు చేయలేదు. దిగుమతి చేసుకునే వాహనాల మీద కూడా ఎటువంటి ట్యాక్స్ తగ్గింపులు వెల్లడికాలేదు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ ఆటోమొబైల్ రంగం మీద అటువంటి వరాలజల్లు కురిపించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement