ఎలక్ట్రిక్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌, వందల కోట్లతో కేంద్రం మాస్టర్ ప్లాన్!

Bpcl To Invest Rs 200 Crore To Set Up 100 Fast Ev Charging - Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ చార్జింగ్‌ కారిడార్లను నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది. 

రద్దీగా ఉండే 100 జాతీయ రహదార్లలో 2023 మార్చి నాటికి 100 కారిడార్లను ఏర్పాటు చేయడం ద్వారా 2,000 స్టేషన్స్‌ను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. 2024–25 నాటికి ఫాస్ట్‌ ఈవీ చార్జింగ్‌ స్టేషన్స్‌ సంఖ్యను 7,000కు చేర్చాలన్నది లక్ష్యమని బీపీసీఎల్‌ రిటైల్‌ ఈడీ బి.ఎస్‌.రవి తెలిపారు.

 అంచనాలను మించి ఈవీ వ్యవస్థ వృద్ధి చెందుతుంది. కనీస మౌలిక వసతుల ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తాం. తొలినాళ్లలో కస్టమర్ల రాక తక్కువగా ఉండడంతో వాణిజ్య పరంగా చార్జింగ్‌ స్టేషన్స్‌ లాభదాయకత కాదు. కాబట్టి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలను కోరతాం’ అని వివరించారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top