అత్యంత చవకైన ఇయర్‌బడ్స్‌ను లాంచ్‌ చేసిన బోట్‌..!  | Boat Airdopes 411 Is the Cheapest Earbuds to Come With Active Noise Cancelation | Sakshi
Sakshi News home page

boAt: అత్యంత చవకైన ఇయర్‌బడ్స్‌ను లాంచ్‌ చేసిన బోట్‌..! 

Mar 23 2022 9:16 PM | Updated on Mar 23 2022 9:23 PM

Boat Airdopes 411 Is the Cheapest Earbuds to Come With Active Noise Cancelation - Sakshi

అత్యంత చవకైన ఇయర్‌బడ్స్‌ను లాంచ్‌ చేసిన బోట్‌..! 

పాపులర్ వేరబుల్స్ బ్రాండ్ బోట్‌ (boAt) యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ సెగ్మెంట్‌లో అత్యంత చౌకైన  ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. ఆడియో వేరబుల్స్ మార్కెట్‌లోకి బోట్‌ 411 ఎయిర్‌డోప్స్‌ను (boAt 411 Airdopes) కంపెనీ లాంచ్‌ చేసింది.  

సరసమైన ధరలకు బడ్జెట్ ఉత్పత్తులను అందించడంలో బోట్‌  ప్రసిద్ధి చెందింది. కంపెనీ ఇంతకుముందు వేవ్ ప్రో 47 అనే స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది.  బోట్‌ 411 ఎయిర్‌డోప్స్‌ ఇయర్‌బడ్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, డ్యూయల్-ఎనేబుల్డ్ మైక్‌, టచ్ కంట్రోల్స్‌తో సహా అనేక ఫీచర్లతో రానుంది. ఇయర్‌బడ్స్‌లో యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో తక్కువ ధరకే ఇయర్‌బడ్స్‌ను బోట్‌ తొలిసారిగా అందిస్తోంది. 

ధర ఏంతంటే..!
బోట్‌ 411 ఎయిర్‌డోప్స్‌ ఇయర్‌బడ్స్‌ రూ. 1999 ఆకర్షణీయమైన ధరకు రానున్నాయి. బ్లాక్ స్టార్మ్, బ్లూ థండర్, గ్రే హరికేన్‌తో వంటి కలర్‌ వేరియంట్స్‌లో లభించనుంది. ఈ ఇయర్‌బడ్స్‌ బోట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. 

బోట్ 411 ఎయిర్‌డోప్స్ స్పెసిఫికేషన్‌లు

  • 10mm డ్రైవర్‌
  • boAt సిగ్నేచర్ సౌండ్‌
  • యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌
  • యాంబియంట్ సౌండ్ మోడ్ 
  • అత్యుత్తమ కాలింగ్‌ నాణ్యతను అందించేందుగాను డ్యూయల్ ENx మైక్స్‌

చదవండి: ఆంబ్రేన్‌ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. అదిరిపోయే ఫీచర్స్‌ ఇవే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement