రూ.10 లక్షల ఖరీదైన ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసిన బీఎమ్‌డబ్ల్యూ

BMW CE 04 Electric Scooter Revealed Globally - Sakshi

ప్రముఖ లగ్జరీ వాహన తయారీ దిగ్గజం బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ చివరకు తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇటీవల బీఎమ్‌డబ్ల్యూ సీఈ 04 పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నీ స్కూటర్ల కంటే చాలా విభిన్నంగా ఉంది. ఈ బీఎమ్‌డబ్ల్యూ సీఈ 04 మోడల్ ధర £11,700(సుమారు రూ.10,29,102)గా ఉంది. డిఫరెంట్ రాడికల్ స్టైల్, ఫ్యూచరిస్టిక్ డిజైన్, అత్యాధునిక సాంకేతిక ఫీచర్లతో బీఎమ్‌డబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ను తయారు చేశారు. ఇది చూడాటానికి స్కేట్ బోర్డ్ మాదిరిగా ఉంది.

ఈ స్కూటర్‌లో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన ‘వి’ ఆకారపు హెడ్‌ల్యాంప్, సింగిల్ పీస్ సీట్, మల్టీ-లేయర్ ఫ్లోర్ బోర్డ్, ఎత్తుగా ఉండే హ్యాండిల్‌బార్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. దీని వేగం గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్లు. దీనిలో బ్రష్-లెస్ డీసీ ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఇది బెల్ట్ డ్రైవ్‌తో నడుస్తుంది. ఈ స్కూటర్ స్టాండర్డ్, అవాంట్‌గార్డ్ స్టైల్ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులోని స్టాండర్డ్ వేరియంట్ వైట్ అండ్ మ్యాట్ బ్లాక్ కలర్స్ లో లభిస్తే, అవాంట్‌గార్డ్ స్టైల్ వేరియంట్ గ్రే మెటాలిక్ అండ్ బ్లాక్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్స్ తో గార్నిష్ చేశారు.

ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, ఇందులో 8.9 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంది. దీనిని ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది 4 గంటల 20 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఇది లిక్విడ్ కూల్డ్ 31 కెడబ్ల్యు(42.5పిఎస్) ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. ఈ స్కూటర్ 9.1 సెకన్లలో 0-100 వేగాన్ని అందుకుంటుంది. దీని ముందు భాగంలో 35 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్లు, వెనుక వైపున సింగిల్ సైడ్ స్వింగ్ ఆర్మ్ ఉన్నాయి. ముందు వైపున 120/70 ఆర్15 టైర్, వెనుక వైపున 160/60 ఆర్15 టైర్లు ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top