డాలర్, బంగారానికి బిట్ కాయిన్ ప్రత్యామ్నాయమా?

Bitcoin won't replace the dollar because it's too volatile - Sakshi

బిట్ కాయిన్‌కు సంబంధించి అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పోవెల్ కీలక వ్యాఖ్యలు చేసారు. సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికీ డిజిటల్ కరెన్సీ అయిన క్రిప్టోకరెన్సీ వంటి వాటి సామర్థ్యాన్ని అన్వేషిస్తోంది. ప్రజలు కూడా బిట్ కాయిన్ రిస్క్‌ను అర్థం చేసుకోవాలని సూచించారు. డాలర్ లేదా బంగారానికి బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు ఎప్పటికి ప్రత్యామ్నాయం కాదని అన్నారు. గత కొంత కాలంగా బిట్ కాయిన్ విలువ భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే  60వేల డాలర్లను కూడా దాటి జీవిత కాల గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం 58వేల డాలర్ల వద్ద ఉంది. 

కరోనా కాలంలో రాకెట్ కంటే వేగంతో దూసుకెళ్తూ పెట్టుబడిదారులను ఆకట్టుకుంటోన్న క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ పైన అమెరికా కేంద్రం బ్యాంకు ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పోవేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు డాలర్ వంటి ప్రధాన కరెన్సీకి ప్రత్యామ్నాయంగా పరిగణించలేమని అన్నారు. వాటి విలువ ఎల్లపుడు అస్థిరతతో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ప్రధాన కరెన్సీకి ప్రభుత్వం మద్దతు ఉందని అయితే, క్రిప్టో కరెన్సీ విలువను నిర్దారించే అసెట్స్ ఏవీ లేవని గుర్తు చేశారు. ఇటీవల టెస్లా, స్క్వేర్ ఇన్వెస్ట్ వంటి దిగ్గజ కంపెనీలు బిట్ కాయిన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో జంప్ చేస్తోంది.

చదవండి:
రియల్టీ కింగ్‌ ఎంపీ లోధా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top