Bitcoin: అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...!

Bitcoin Wallet That Went From Rs 6 Lakhs to Rs 216 Crores - Sakshi

స్టాక్ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, షేర్లు, క్రిప్టోకరెన్సీ.. ఇవ్వన్నీ సామాన‍్య జనాలకు అర్థం కాని సబ్జెక్ట్‌. ఒక్కసారి వీటిలో ప్రావీణ్యం సాధిస్తే డబ్బులే..డబ్బులు..! స్టాక్‌మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, క్రిప్టోకరెన్సీలో ప్రావీణ్యం ఉంటే రాత్రికి రాత్రే కుబేరుడు అవ్వచు లేదా బికారీ కూడా అవ్వచును. స్టాక్‌మార్కెట్‌లో పలు కంపెనీల షేర్లు పడిపోతున్నాయనో లేదా నాకు వచ్చిన లాభాలు సరిపోతాయని చెప్పి వెంటనే వెనక్కి తీసుకుంటారు. అలా చేస్తే నష్టాల నుంచి కాస్త ఉపశమనం కల్గిన..చాలా కాలంపాటు షేర్లను వెనక్కి తీసుకోకుండా కొంత కాలం పాటు వేచిచూస్తే భారీ లాభాలనే ఆర్జించవచ్చును. 
చదవండి: Bitcoin: బిట్‌కాయిన్‌ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్‌ సంచలన ప్రకటన..!

ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ కంటే క్రిప్టోకరెన్సీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. 2009లో మొదలైన క్రిప్టోకరెన్సీలో ఒకటైన బిట్‌కాయిన్‌ ప్రస్థానం నేడు గణనీయంగా పెరిగింది. క్రిప్టోకరెన్నీ వచ్చిన తొలినాళ్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడానికి జంకేవారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి 2012లో సుమారు 616 బిట్‌కాయిన్‌ టోకన్లను కొన్నాడు.

2012లో బిట్‌కాయిన్‌ విలువ సుమారు 13 డాలర్లు(రూ. 978) గా ఉండేది. 616 బిట్‌కాయిన్ల మొత్తం 8,195 డాలర్లు (రూ. 6 లక్షలు). ఆ వ్యక్తి సుమారు  తొమ్మిది సంవత్సరాలు పాటు తన బిట్‌కాయిన్‌ వ్యాలెట్‌ను చూసుకొలేదు. బిట్‌కాయిన్‌ ఒక్కసారిగా గణనీయంగా వృద్ధి చెందడంతో...బిట్‌కాయిన్‌ వ్యాలెట్‌ విలువ సుమారు రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్ల పెరిగింది. 

బిట్‌కాయిన్‌ వ్యాలెట్‌ను వేరే వ్యాలెట్‌లోకి మార్చేప్పడు జరిగిన లావాదేవీలను బ్లాక్‌చైన్‌. కామ్‌ నిర్ధారించింది.    ఇలాంటి సంఘటన ఈ ఏడాది జూలైలో కూడా జరిగింది. దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టి, ఓపికగా ఉంటే భారీ మొత్తాలు చేతికి వస్తాయనడంలో ఇదొక ఉదాహరణగా చెప్పకోవచ్చునని సోషల్‌మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. 
చదవండి:  క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top