విజయ్‌ మాల్యా.. ఇప్పటికయితే ఉన్న ఇల్లుని కాపాడుకున్నాడు

Big Relief To Vijay Mallya To Hold Their Luxury Home in London - Sakshi

లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యాకి లండన్‌ కోర్టులో ఊరట లభించింది. బ్యాంకు లోన్లు చెల్లించని కారణంగా ఇంటిని జప్తు చేయోచ్చుంటూ గతంలో వచ్చిన తీర్పుపై ఆయనకు ఊపశమనం లభించింది. విజయ్‌ మాల్యా కుటుంబానికి లండన్‌లోని కార్న్‌వాల్‌లో విలాసవంతమైన భవనం ఉంది. విజయ్‌ మాల్యా తల్లి లలితా మాల్యాతో పాటు కొడుకు సిద్ధార్థ్‌ మాల్యా అక్కడ నివసిస్తున్నారు.

గతంలో స్విస్‌ బ్యాంక్‌, రోజ్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ల నుంచి తీసుకున్న రుణాన్ని విజయ్‌ మాల్యా సకాలంలో చెల్లించలేదు. దీంతో అప్పు కింద మాల్యా కుటుంబం నివిస్తున్న ఇంటిని స్వాధీనం చేసుకుంటామంటూ అప్పిచ్చిన సంస్థలు కోర్టును ఆశ్రయయించాయి. అనేక వాయిదాల్లో విచారణ జరిగిన తర్వాత ‘ విజయ్‌ మాల్యా తక్షణమే ఇంటిని ఖాళీ చేయాలని.. అప్పిచ్చిన సంస్థలు ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చంటూ ’ కోర్టు తీర్పు ఇచ్చింది.

స్విస్‌ బ్యాంక్‌, రోజ్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ల దగ్గర తీసుకున్న అప్పులను మాల్యా ఫ్యామిలీ ట్రస్టు నిధుల నుంచి చెల్లిస్తానని, తన ఇంటి జప్తును ఆపాలంటూ తిరిగి కోర్టును ఆశ్రయించాడు విజయ్‌మాల్యా. అయితే గతంలో ఈ తరహాలోనే అనేక హామీలు ఇచ్చి వాటిని నేరవేర్చలేదని. కాబట్టి తన అప్పులను ట్రస్టు ద్వారా తీరుస్తానంటూ ఇచ్చే హామీని తోసిపుచ్చాలంటూ అప్పులు ఇచ్చిన సంస్థలు న్యాయస్థానం ముందు వాదించాయి.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ట్రస్‌ ద్వారా అప్పులు చెల్లించడం చట్ట విరుద్ధమైమీ కాదంటూ 2022 మార్చి 4న తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పటికిప్పుడు లండన్‌ ఇంటిని బ్యాంకులు స్వాధీనం చేసుకునే పని ఆగి పోయింది. వృద్ధురాలైన తల్లితో లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న మాల్యాకు తాజా తీర్పు గొప్ప ఉపశమనం కలిగించింది.
 

చదవండి: విజయ్‌మాల్యాకు భారీ షాక్‌! లండన్‌ నివాసం నుంచి గెట్‌ అవుట్‌ ?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top