Ajay Banga ప్రపంచబ్యాంకు నూతన అధ్యక్షుడు: బైడెన్‌ ప్రతిపాదన

Biden nominates ex Mastercard CEO to lead World Bank - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచబ్యాంకు  అధ్యక్షుడుగా భారత సంతతికి చెందిన, మాస్టర్‌కార్డ్ మాజీ సీఈఓ అజయ్ బంగా నామినేట్‌  అయ్యారు. ప్రస్తుత చీఫ్‌ డేవిడ్‌ మాల్‌పాస్‌ ముందస్తుగా పదవీ విరమణ చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో  మాస్టర్‌కార్డ్‌ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అజయ్‌ బంగాను ప్రపంచబ్యాంకుకు నాయకత్వం వహించేందుకు నామినేట్‌ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ గురువారం తెలిపారు.  అమెరికా ప్రపంచ బ్యాంక్ అతిపెద్ద వాటాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. 

 "వాతావరణ మార్పులతో సహా మన కాలంలోని అత్యంత అత్యవసర సవాళ్లను పరిష్కారానికి సంబంధించి పబ్లిక్-ప్రైవేట్ వనరులను సమీకరణలో బంగాకు  అపారమైన అనుభవం ఉందని బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు.  క్లిష్ట సమయంలో ఉన్న  ప్రపంచ బ్యాంకును లీడ్‌ చేసేందుకు అజయ్ ప్రత్యేక అర్హతలున్నాయని ఆయన ప్రశంసించారు.  వరల్డ్‌ బ్యాంకు ప్రెసిడెంట్‌ ఎంపిక కోసం అభ్యర్థుల నామినేషన్‌ల స్వీకరణ ప్రారంభమైంది. మార్చి 29 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మహిళా అభ్యర్థులకు ఎక్కువ ప్రోత్సాహనిస్తున్నట్టు బ్యాంక్ పేర్కొంది.  దీనికితోడు మరొక ప్రధాన వాటాదారు అయిన జర్మనీ 77 ఏళ్ల చరిత్రలో బ్యాంక్‌కు ఎన్నడూ మహిళ నాయకత్వం వహించనందున ఉద్యోగం మహిళకే చెందాలని పేర్కొంది. 

అజయ్‌ బంగా
1959 నవంబర్ 10 న పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్‌లో జన్మించారు. అజయ్‌ బంగా. ఢిల్లీ యూనివర్శిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) డిగ్రీ, అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి మేనేజ్‌మెంట్‌లో పీజీపీ పట్టా పొందాడు.భారత ప్రభుత్వం 2016లో బంగాకు పద్మశ్రీ పౌర గౌరవాన్ని అందించింది. అజయ్‌ బంగా ప్రస్తుతం ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. అతను గతంలో మాస్టర్ కార్డ్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సేవలందించారు.12 సంవత్సరాల  తరువాత  డిసెంబర్ 2021లో మాస్టర్ కార్డ్‌ కు  పదవీ విరమణ చేసారు.

కాగా పదవీకాలం ముగిసేందుకు మరో ఏడాది సమయం ఉండగానే ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మాల్పాస్‌ రాజీనామా చేయబోతున్నట్లు  ఈనెల (ఫిబ్రవరి) ప్రకటించారు.జూన్‌ నుంచి బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు  తెలిపిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top