
ప్రతి నెలా ఏవో కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి. అయితే వినియోగదారుడి అవసరాలకు సరిపోయే, బడ్జెట్‌కు తగిన స్మార్ట్‌ఫోన్‌లు కొన్నే ఉంటాయి. వాటిని ఎంచుకోవడం కష్టమైన పనిగా మారింది. ఈ నేపథ్యంలో సామాన్య వినియోగదారులకు బడ్జెట్‌లో అంటే రూ.10 వేల లోపు ధరలో జూలైలో వచ్చిన కొన్ని బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.
శాంసంగ్ ఎం06 5జీ
🔹శాంసంగ్ ఎం06 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆర్మ్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. 4/6 జీబీ LPDDR4X ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు
🔹వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ షూటర్ ఉంది.
🔹సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, సింగిల్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉన్నాయి. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 60
🔹ఇన్ఫినిక్స్ హాట్ 60లో 6.7 అంగుళాల హెచ్‌డీ+ పంచ్ హోల్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది 7.8 మిమీ మందంతో ఉంటుంది. వాటర్, డస్ట్ ప్రూఫ్ కోసం ఐపీ 64 రేటింగ్ పొందింది. అంటే ఇది స్ప్లాష్‌లు, తేలికపాటి నీటి చుక్కలు పడినా ఏమీకాదు.
🔹హాట్ 60 5జీ + మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ సింగిల్ 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 2 టీబీ వరకు అదనపు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.
🔹హాట్ 60 5జీ ప్లస్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, ఎల్ఈడీ ఫ్లాష్ సపోర్ట్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కొత్త ఎక్స్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఇది పనిచేస్తుంది.
🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

లావా స్టార్మ్ ప్లే
🔹లావా స్టార్మ్ ప్లే ఫోన్‌లో 6.75 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 6 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
🔹50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 752 ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది.
🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

ఐక్యూ జెడ్10 లైట్ 5జీ
🔹ఐక్యూ జెడ్10 లైట్ 6.74 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 8 జీబీ వరకు ఎల్ పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ ఎక్స్ టర్నల్ స్టోరేజ్ పొందవచ్చు.
🔹ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 15వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
🔹ఆప్టిక్స్ విషయానికి వస్తే, జెడ్ 10 లైట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది.