బ్యాంకుల ప్రైవేటీకరణకు త్వరలో చట్ట సవరణ!

Banking Privatization Amendment Bill in Winter Session - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో మెజారిటీ వాటాల విక్రయానికి అనుగుణంగా బ్యాంకింగ్‌ చట్ట సవరణ బిల్లు, 2021ను 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. తాజా చట్ట సవరణ బిల్లులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనీస ప్రభుత్వ వాటాను 51 శాతం నుండి 26 శాతానికి తగ్గించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ఇంకా కేంద్ర మంత్రివర్గం ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత  ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని 2021–22 బడ్జెట్‌ నిర్దేశించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top