
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 2025 నెలలో బ్యాంక్ సెలవులకు (Bank Holidays) సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ ప్రకారం.. వచ్చే నెలలో దేశంలోని వివిధ బ్యాంకులకు చాలా రోజులు సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొన్ని నేషనల్ హాలిడేయ్ కాగా.. మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. మొత్తం సెలవుల జాబితా విషయానికి వస్తే..
అక్టోబర్ సెలవుల జాబితా
➤అక్టోబర్ 1, బుధవారం: మహా నవమి (ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 2, గురువారం: గాంధీ జయంతి / విజయ దశమి (దేశంలోని అని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 5 ఆదివారం: దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు
➤అక్టోబర్ 6, సోమవారం: లక్ష్మీ పూజ (మహారాష్ట్ర, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 7, మంగళవారం: మహర్షి వాల్మీకి జయంతి (హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 11, శనివారం:(రెండవ శనివారం కారణగం దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 12, ఆదివారం: (దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 19, ఆదివారం: (దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 20, సోమవారం: దీపావళి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో సహా.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 21, మంగళవారం: గోవర్ధన్ పూజ / లక్ష్మీ పూజ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, సిక్కిం, మణిపూర్, జమ్మూ, శ్రీనగర్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 22, బుధవారం: బలిపాడ్యమి (గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, రాజస్థాన్, సిక్కింలోని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 26 ఆదివారం: (దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 27 సోమవారం: చత్ పూజ (పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్‌లోని బ్యాంకులకు సెలవు)
➤అక్టోబర్ 31 శుక్రవారం: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (గుజరాత్‌లోని బ్యాంకులకు సెలవు)
అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.