బరోడా కిసాన్‌ పక్వాడా.. రైతు రుణాలకే అధిక ప్రాధాన్యం

Bank Of Baroda Is Organising Kisan Pakhwada Diwas - Sakshi

హైదరాబాద్:  ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని కిసాన్‌ దివాస్‌ను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రారంభించింది. ఫుడ్‌ అండ్‌ ఆగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (FAO) ఆలోచనలకు అనుగుణంగా మన చర్యలే మన భవిష్యత్‌ థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పక్షం రోజుల పాటు నిర్వహించే ఈ బరోడా కిసాన్‌ పక్వాడాలో భాగం కావాలంటూ రైతులకు పిలుపు నిచ్చింది. భారతదేశవ్యాప్తంగా పక్షం రోజులపాటు సాగే ఈ కార్యక్రమం 2021 అక్టోబర్‌ 31న ముగుస్తుంది.

బరోడా కిసాన్‌ దివాస్‌ సందర్భంగా 18 జోనల్‌ కార్యాలయాల్లో సెంటర్‌ ఫర్ ఆగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ (CAMP) పేరుతో కొత్త కేంద్రీకృత వ్యవసాయ రుణాల ప్రాసెసింగ్‌ కేంద్రాలను బరోడా బ్యాంకు ప్రారంభించింది. సంప్రదాయేతర వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ మార్కెటింగ్‌ వంటి వ్యవహారాలను ‍క్యాంప్‌ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ జోన్‌ జనరల్‌ మేనేజర్‌ మన్‌మోహన్ గుప్తా మాట్లాడుతూ... వ్యవసాయ రంగంలో గోల్డ్ లోన్స్, సెల్ఫ్‌ హెల్ప్ గ్రూప్‌ ఫైనాన్స్‌కు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top