బంధన్ బ్యాంక్ సీఈఓగా రతన్ కుమార్ కేష్‌ | Bandhan Bank Appoints Ratan Kumar Kesh as Interim MD And CEO | Sakshi
Sakshi News home page

బంధన్ బ్యాంక్ సీఈఓగా రతన్ కుమార్ కేష్‌

Jul 7 2024 2:51 PM | Updated on Jul 7 2024 3:09 PM

Bandhan Bank Appoints Ratan Kumar Kesh as Interim MD And CEO

బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'రతన్ కుమార్ కేష్' జూలై 10 నుంచి అమలులోకి వచ్చేలా ప్రైవేట్ లెండర్ తాత్కాలిక ఎండీ అండ్ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న ఎండీ & సీఈఓ చంద్ర శేఖర్ ఘోష్ 2024 జులై 9న పదవీ విరమణ చేయనున్నారు.

జూలై 6న సమావేశంలో రతన్ కుమార్ కేష్‌ను తాత్కాలిక ఎండీ అండ్ సీఈఓగా నియమిస్తూ డైరెక్టర్ల బోర్డు తీర్మానించింది. ఈ నియామకం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం కూడా లభించింది.

రతన్ కుమార్ కేష్ మార్చి 2023 నుంచి బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. అంతకంటే ముందు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, యెస్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్‌లలో కూడా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement