గూగుల్‌ షాకింగ్‌ నిర్ణయం...! వారికి పెద్ద సమస్యే..!

Bad News For Android App Developers Google To Close Inactive Accounts - Sakshi

ఆండ్రాయిడ్‌ యాప్‌లను క్రియేట్‌ చేసే డెవలపర్లకు గూగుల్‌ చేదు వార్తను అందించింది. గూగుల్‌ ప్లేస్టోర్‌లో పలు లిస్టెడ్‌ యాప్‌లపై షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఇన్‌ఆక్టివ్‌గా ఉన్న యాప్‌లను, అలాగే చాలా రోజుల పాటు అప్‌డేట్‌ చేయకుండా ఉన్న యాప్‌లను పూర్తిగా తొలగించాలని గూగుల్‌ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2021 సెప్టెంబర్ 1 నుంచి ఆయా యాప్స్‌ తొలగింపు ప్రక్రియ మొదలవుతుందని గూగుల్‌ ప్రకటించింది. 

ఇన్‌ఆక్టివ్‌గా ఉన్న యాప్‌లను తొలగించడంతో గూగుల్‌ ప్లే స్టోర్‌ క్లీన్‌ అవ్వడంమేకాకుండా ప్లే స్టోర్‌ భద్రత మరింత పటిష్టమైతుందని గూగుల్‌ పేర్కొంది. లోపాలు, బగ్‌లను కల్గిఉన్న యాప్‌లను గూగుల్‌ ఎప్పటికప్పుడు తీసువేస్తుంది. ఆండ్రాయిడ్‌ యాప్‌ డెవలపర్స్‌ యాక్టివ్‌గా వారి యాప్‌లను మెయిన్‌టెన్‌ చేస్తే గూగుల్‌ ప్లే వాటిని తొలగించదు.  గూగుల్ స్టోర్‌లో యాక్టివ్‌గా ఉండి, సుమారు 1000కిపైగా ఇన్‌స్టాల్‌ కలిగి ఉన్న యాప్‌లు, లేదా గత 90 రోజుల్లో ఇన్‌ యాప్‌ పర్చెస్‌ కల్గి ఉన్న యాప్‌లను తొలగించదని గూగుల్‌ పేర్కొంది. 

కొత్త పాలసీ అప్‌డేట్‌ కింద యాప్‌లను తిరిగి పాత యాప్‌లను, డేటాను పునరుద్దరించలేరు. వాటి స్థానంలో కచ్చితంగా కొత్త వాటినే సృష్టించాల్సి ఉంటుంది. యాక్సెసిబిలిటీ సర్వీస్ ఏపీఐ టూల్‌ను గూగుల్‌ జత చేయనుంది. ఇది యూజర్ డేటా,  డివైజ్‌ ఫంక్షనాలిటీను యాక్సెస్ చేయడానికి సహాయపడుతుంది. దీంతో యూజర్లు  సురక్షితంగా యాప్‌లను యాక్సెస్ చేయగలరు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top