హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ కేంద్రాల నుంచి డీలర్‌షిప్స్‌కు గత నెలలో వాహనాల సరఫరా 23 శాతం తగ్గింది. 2021 ఫిబ్రవరిలో అన్ని రకాల వాహనాలు కలిపి 17,35,909 యూనిట్లు డీలర్‌షిప్ కేంద్రాలకు చేరాయి.
గత నెలలో ఈ సంఖ్య 13,28,027 మాత్రమే. సెమికండక్టర్ల కొరత, సరఫరా సమస్యలకుతోడు వాహనాల ధరల పెరుగుదల ఇందుకు కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది.

విడిభాగాలు ప్రియం కావడం, రవాణా ఖర్చులు భారమవడంతో పరిశ్రమలో మొత్తం అమ్మకాలపై ప్రభావం చూపిందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. ప్రపంచ సరఫరా వ్యవస్థ ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నందున రష్యా–ఉక్రెయిన్ వివాదం ప్రభావాన్ని పరిశ్రమ నిశితంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు


