'అథర్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బంపర్‌ ఆఫర్‌.. ఏ స్కూటర్‌కైనా ఛార్జింగ్‌ ఫ్రీ | Sakshi
Sakshi News home page

Ather Energy: ''అథర్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బంపర్‌ ఆఫర్‌.. ఏ స్కూటర్‌కైనా ఛార్జింగ్‌ ఫ్రీ

Published Thu, Sep 30 2021 10:50 AM

Ather Energy extends free charging till December 2021  - Sakshi

ఎలక్ట్రిక్‌ వాహనదారులకు 'అథర్‌ ఎన‌ర్జీ' బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఎలక్ట్రిక్‌ వాహనదారులకు తగినంతగా ఛార్జింగ్‌ స్టేషన్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారి సమస్యకు చెక్‌ పెట్టేలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉచితగా ఛార్జింగ్‌ సర్వీస్‌ను పొడిగిస్తున్నట్లు అథర్‌ ఎనర్జీ సీఈఓ తరుణ్‌ మెహతా ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ఛార్జింగ్‌ స్టేషన్ల సంఖ్య ను 500పెచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు.   

బెంగ‌ళూరు కేంద్రంగా అథర్‌ ఎనర్జీ 450 ఎక్స్‌, 450 ఎక్స్ ప్ల‌స్‌ ఎలక్ట్రికల్‌ స్కూటర్ల (ఈవీ) అమ్మకాల్ని ముమ్మరం చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీలపై ఇస్తున్న సబ్సీడీ ఆధారంగా వెహికల్ ధరల్ని తగ్గిస్తుంది. పనిలో పనిగా అథర్‌ గ్రిడ్‌ పేరుతో అందిస్తున్న ఉచిత ఛార్జింగ్‌ సర్వీస్‌ను ఈ ఏడాది డిసెంబర్‌ వరకు పొడిగిస్తున్నట్లు తరుణ మెహతా వెల్లడించారు.ఈ గ్రిడ్‌ లోకేషన్లలో అథర్‌ సంస్థతో పాటు ఇతర కంపెనీల ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఉచితంగా ఛార్జింగ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు అథర్‌ ప్రకటించింది.

ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాట్లు 
ఎలక్ట్రిక్‌ వాహనదారులు ఛార్జింగ్‌ పాయింట్లను వినియోగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాహనదారుల అవసరాన్ని బట్టి ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అథర్‌ సీఈఓ తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఉన్న 24 ప్రధాన నగరాల్లో 200 ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను నెలకొల్పినట్లు, 2022 మార్చి నాటికి ఆ సంఖ్యను 500 పెంచనున్నారు. ప్రతి నెల 45 కొత్త ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నట్లు అథర్‌ ఎనర్జీ సీఈఓ తరుణ మెహతా అన్నారు. 

చదవండి: కొత్త చట్టం, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఛార్జర్లు ఉండేలా ఇళ్లను నిర్మించాలి..

Advertisement
Advertisement