జోయ్ అలుక్కాస్‌కు భారీ షాక్‌: కోట్ల ఆస్తులు స్వాధీనం

Assets Worth rs 305 Crore Of Jewellery Chain Joyallukas Seized - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఆభరణాల సంస్థ జోయ్ అలుక్కాస్‌కు భారీ షాక్‌ తగిలింది. ఐదు రోజుల వరుస సోదాల  తర్వాత  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.305.84 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిందని ఈడీ శుక్రవారం ఆరోపించింది.

(ఇదీ చదవండి:  షాకింగ్‌: 8500 మందిని తొలగించనున్న టెలికాం దిగ్గజం

అటాచ్ చేసిన ఆస్తులలో రూ. 81.54 కోట్ల విలువైన 33 స్థిరాస్తులు ఉన్నాయి. 91.22 లక్షల విలువైన మూడు బ్యాంకు ఖాతాలు, రూ. 5.58 కోట్ల విలువైన మూడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 217.81 కోట్ల విలువైన జోయల్లుకాస్ షేర్లను కూడా ఈడీ సీజ్ చేసింది. హవాలా మార్గాల ద్వారా భారతదేశం నుండి దుబాయ్‌కి భారీ మొత్తంలో నగదును బదిలీ చేసి, ఆ తర్వాత 100 శాతం జాయ్ అలుక్కాస్ వర్గీస్‌కు చెందిన జోయల్లుకాస్ జ్యువెలరీ LLC, దుబాయ్‌లో పెట్టుబడి పెట్టింది. రూ. 2,300 కోట్ల ఐపీవో ఉపసంహరించుకున్న మరునాడే  వరుస సోదాలు చేపట్టిన అధికారులు భారీ మొత్తంలో ఆస్తులను సీజ్‌ చేయడం గమనార్హం. (StudentVisa అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అదిరిపోయే న్యూస్‌!)

కాగా దేశంలోనే రెండవ అతిపెద్ద ఆభరణాల జోయ్ అలుక్కాస్‌కు దేశవ్యాప్తంగా 68 శాఖలున్నాయి. జ్యూయలరీ బిజినెస్‌లో దేశంలో, ముఖ్యంగా సౌత్‌ ఇండియాలో బాగా పాపులర్‌ అయింది. అయితే 25 ఎకరాల్లో నిర్మించబోయే ప్రాజెక్టు కోసం విదేశాలకు హవాలా రూపంలో రూ. 300 కోట్ల నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జోయ్ అలుక్కాస్ అధినేత అధికార నివాసాలు, కార్పొరేట్ ఆఫీసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top