అశోక్‌ లేలాండ్‌ లాభం డౌన్‌ | Ashok Leyland Q4 net profit drops 58percent to Rs 158 cr | Sakshi
Sakshi News home page

అశోక్‌ లేలాండ్‌ లాభం డౌన్‌

May 20 2022 12:56 AM | Updated on May 20 2022 5:10 AM

Ashok Leyland Q4 net profit drops 58percent to Rs 158 cr - Sakshi

న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం అశోక్‌ లేలాండ్‌ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 58 శాతం క్షీణించి రూ. 158 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 377 కోట్లు ఆర్జించింది.

మొత్తం ఆదాయం మాత్రం రూ. 8,142 కోట్ల నుంచి రూ. 9,927 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 7,831 కోట్ల నుంచి రూ. 9,430 కోట్లకు పెరిగాయి. ముడివ్యయాలు రూ. 1,100 కోట్లమేర పెరిగి రూ. 6,581 కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. వీటికితోడు రూ. 267 కోట్ల అనుకోని నష్టం నమోదైనట్లు తెలియజేసింది. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున డివిడెండు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement