Reliance Industries : త్వరలోనే రిలయన్స్ భారీ డీల్..!

ముంబై: విదేశీ చమురు దిగ్గజం సౌదీ అరామ్ కోతో, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో వాటాను దక్కించుకునే విషయంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ చమురు- కెమికల్స్ వ్యాపారంలో సుమారు 20 శాతం వాటాల అమ్మకంకోసం గతంలోనే సౌదీ అరామ్‌కోతో రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్ కుదుర్చుకునే బాటలో సాగింది. ప్రస్తుతం రిలయన్స్ కంపెనీ వాటాను కొనుగోలు చేసే విషయంలో ఇరు కంపెనీల మధ్య అదనపు చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
రిలయన్స్, ఆరామ్‌కో కంపెనీల మధ్య డీల్ విలువ సుమారు 20 బిలియన్ డాలర్ల నుంచి 25 బిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చునని తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే రిలయన్స్ కంపెనీ షేర్లను ఆరామ్‌కో కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం గురించి వార్తలు రావడంలో రిలయన్స్ కంపెనీ షేర్లు ఏకంగా 2.6 శాతం మేర లాభాలను గడించాయి. ఈ డీల్ ప్రకారం ఏడ్‌నాక్, రిలయన్స్ సంయుక్తంగా క్లోర్-ఆల్కలీ, ఇథిలీన్ డైక్లోరైడ్, పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) ని ఉత్పత్తి చేయనున్నాయి. దీనికి సంబంధించి అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఎడిఎన్‌ఓసి) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
రిలయన్స్ 44 వార్షిక సమావేశంలో రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సౌదీ కంపెనీ ఆరామ్‌కోతో భాగస్వామ్యాన్ని వెల్లడించారు. రిలయన్స్ అంతర్జాతీయీకరణకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆరామ్‌కో ఛైర్మన్ యాసిర్ అల్-రుమయ్యన్‌ను రిలయన్స్ వార్షిక సమావేశంలో స్వతంత్ర డైరెక్టర్‌గా చేర్చుకున్న విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు