Apples Maiden Retail Store to Launch in Mumbai on April 18 - Sakshi
Sakshi News home page

భారత్‌లో తొలి యాపిల్‌ స్టోర్‌.. ఫస్ట్‌ లుక్‌ అదిరింది!

Apr 17 2023 8:52 PM | Updated on Apr 17 2023 9:35 PM

Apple's First Retail Store Apple Bkc In Mumbai To Open On April 18 Jio World Drive Mall In Mumbai - Sakshi

భారత్‌లో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ దేశీయంగా రెండు యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌లను ప్రారంభించనుంది. ఏప్రిల్‌ 18న యాపిల్‌ తన మొదటి స్టోర్‌ను ముంబైలో, ఏప్రిల్‌ 20న ఢిల్లీలో రెండో స్టోర్‌ తెరవనుంది. 

ప్రపంచంలోని ఐకానిక్ బ్రాండ్ రీటైల్‌ స్టోర్‌ ప్రారంభోత్సవానికి టిమ్‌ కుక్‌ హాజరు కానున్నారు. పలు నివేదికల ప్రకారం.. యాపిల్‌ సీఈవో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.


యాపిల్‌ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓబ్రియన్ మాట్లాడుతూ..యాపిల్‌ రీటైల్‌ స్టోర్‌లలో ఉండే 100 మంది సిబ్బంది 18 మంది భాషల్లో మాట్లాడతారని తెలిపారు. సంస్థ దేశంలో 2,500 మందికి ఉపాధి కల్పిస్తోందని, యాప్ ఎకోసిస్టమ్ ద్వారా 10 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో పరోక్షంగా సహాయపడిందని ఆమె చెప్పారు.

యాపిల్‌కు ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో 500 రిటైల్‌ స‍్టోర్‌లు ఉన్నాయి. ఆ స్టోర్‌లలో ఉన్న ఫీచర్లే భారత్‌లో ప్రారంభించబోయే స్టోర్‌లలో ఉన్నాయి. అయితే స్థానికతకు పెద్దపీట వేస్తూ రూపొందించిన రెండు స్టోర్లూ భారత వినియోగదారులకు కొత్త అనుభూతిని పంచేలా దృష్టిసారించింది. 

ముఖ్యంగా స్టోర్ లోపల గోడల కోసం, కంపెనీ ప్రత్యేకంగా రాజస్థాన్ నుండి రాయిని కొనుగోలు చేసింది. 4.5 లక్షల కలప ముక్కలు పైకప్పు గోడలను అలంకరించింది.స్టోర్‌లో ఉత్పత్తులు, కస్టమర్‌ల కోసం అందుబాటులో ఉన్న గాడ్జెట్‌లను రిపేర్ చేయడం వంటి సేవలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌లు మాట్లాడుతూ..కస్టమర్‌లు ప్రొడక్ట్‌లను తనిఖీ చేసుకోవచ్చని వాటిని  ఎలా ఉపయోగించాలనే అంశంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement