యాపిల్‌ ఐఫోన్‌ కొనాలనుకుంటున్నారా? ఇదిగో ఆఫర్‌! | Apple's Mega Sale: Massive discounts on iPhones; check details - Sakshi
Sakshi News home page

యాపిల్‌ ఐఫోన్‌ కొనాలనుకుంటున్నారా? ఇదిగో ఆఫర్‌!

Published Wed, Aug 23 2023 8:14 PM

Apple Mega Sale Massive discounts on iPhones check details - Sakshi

Apple Mega Sale:యాపిల్‌ ఐఫోన్‌ లవర్స్‌కు బంపర్‌ ఆఫర్‌ ఆందిస్తోంది. త్వరలోనే కొత్త ఐఫోన్‌ 15 సిరీస్‌ లాంచ్‌ కానున్న నేపథ్యంలో పాపులర్‌ ఐఫోన్లు భారీ డిస్కౌంట్‌లో ధరలో లభ్యం. ఐఫోన్ 14 ప్లస్‌, ఐఫోన్ 14 , ఐఫోన్ 13,ఐఫోన్ 1, ఐఫోన్‌ తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్‌ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి లేదా కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తోంది. 

ఐఫోన్ 14 ప్లస్‌
ముఖ్యంగా  ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ ఆఫర్‌ అందుబాటులోఉంది. దీన్ని రూ. 72,999 వద్దే దీన్ని సొంతం చేసుకోవచ్చు. దీని లాంచింగ్‌ ప్రైస్‌ రూ.89,990.  ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ కింద  నిబంధనల ప్రకారం రూ. 48,999 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. అలాగే   HDFC కార్డుద్వారా జరిపే కొనుగోళ్లపై  128 జీబీ వేరియంట్‌పై అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు.  6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, ఏ15  బయోనిక్ చిప్‌సెట్ ,  12ఎంపీ డ్యుయల్‌ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (ఇక జాబిల్లిపై కోట్లాది భారతీయుల కొత్త కలలు: ఆనంద్‌ మహీంద్ర)

ఐఫోన్ 14 
ఐఫోన్ 14 పై అసలు ధరలో 14శాతందాకా తగ్గింపు. అంటే ప్రస్తుతం ఈ ఫోన్‌ రూ. 67,999కి అందుబాటులో ఉంటుంది. ఇక ఫీచర్ల విషయానికివస్తే 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఆకట్టుకునే బ్యాటరీ సామర్థ్యం ప్రత్యేకం..

ఐఫోన్ 13, ఐఫోన్ 12 
ఈ సేల్‌లో ఐఫోన్ 13ను రూ. 59,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ 12 ను డిస్కౌంట్‌ తరువాత రూ. 51,999 కొనుగోలు చేయ వచ్చు.  ఇక ఐఫోన్ 11  64GB వేరియంట్‌ను కేవలం రూ. 41,999 వద్ద అందుబాటులో ఉంది. 
 

Advertisement
 
Advertisement