ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్‌ సేల్‌: ఐఫోన్‌13పై రూ.10 వేలు డిస్కౌంట్‌!

apple iphone 13 available for under rs 60000 flipkart - Sakshi

యాపిల్‌ ఐఫోన్‌13పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. ఐఫోన్‌ 13 ఒక సంవత్సరం పాతదే అయినా ఇప్పటికీ చాలా మంది దాన్ని కొనడానికి చూస్తున్నారు. యాపిల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్‌ 13 ధర రూ.69,990. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. ఐఫోన్‌13 128జీబీ వేరియంట్ రూ.60 వేల కంటే తక్కువకే లభిస్తోంది.

యాపిల్‌ ఐఫోన్‌13 128జీబీ వేరియంట్‌ అసలు ధర రూ.69,990. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ రూ.10,901 డిస్కౌంట్‌ ఇస్తోంది. దీంతో రూ.58,999కే ఐఫోన్‌13ను సొంతం చేసుకోవచ్చు. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా అదనంగా మరో రూ.1,000 తగ్గింపు పొందవచ్చు . అంటే రూ.57,999కే ఐఫోన్‌13 మీ చేతికి వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న సమ్మర్ సేల్‌లో భాగంగా ఈ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ సమ్మర్‌ సేల్‌ ఏప్రిల్ 17న ముగియనుంది.

ఐఫోన్‌13 ఫీచర్లు ఇవే..

  • సిరామిక్ షీల్డ్‌తో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే
  • సాధారణ పరిస్థితుల్లో 800 నిట్‌లు, HDRతో 1200 నిట్‌ల బ్రైట్‌నెస్‌
  • Apple A15 బయోనిక్ చిప్‌సెట్, iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్
  • 12MP + 12MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ 
  • పోర్ట్రెయిట్ మోడ్, ఆటోమేటిక్ నైట్ మోడ్, 4K వీడియో రికార్డింగ్, స్లో మోషన్ వంటి అనేక రకాల ఫీచర్లు

ఇదీ  చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్‌ న్యూస్‌.. ఇక దూసుకెళ్లడమే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top