Apple, Google, Samsung: సై అంటే సై అంటూన్న దిగ్గజ టెక్‌ కంపెనీలు..!

Apple Google And Samsung Ready For Launch Events - Sakshi

దిగ్గజ టెక్‌ కంపెనీలు ఆపిల్‌, గూగుల్‌, శాంసంగ్‌ పోటాపోటీగా లాంచ్‌ ఈవెంట్స్‌కు సిద్దమయ్యాయి. ఈ మూడు కంపెనీలు తమ ఉత్పత్తుతో మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేయడానికి రెడీగా ఉన్నాయి. ఆపిల్‌, గూగుల్‌, శాంసంగ్‌ వరుసగా అక్టోబర్‌ 18, 19, 20 తేదీల్లో లాంచ్‌ ఈవెంట్లను జరుపుతున్నాయి.

ఆపిల్‌ మాక్‌బుక్‌ లాంచ్‌ ఈవెంట్‌...!
ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ సెప్టెంబర్‌ 14ను ఐఫోన్‌13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్‌13 స్మార్ట్‌ఫోన్లపై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణనే నోచుకుంది.  ప్రపంచ మార్కెట్లలో తన సత్తాను మరోసారి చాటేందుకుగాను మ్యాక్‌బుక్స్‌, ఎయిర్‌పాడ్స్‌3తో ఆపిల్‌ అక్టోబర్‌ 18 న ముందుకురానుంది.

ఈ సారి 14, 16 ఇంచుల మ్యాక్‌ బుక్‌తో ఆపిల్‌ లాంచ్‌ చేయనుంది. మాక్‌ బుక్‌ విషయంలో 2016 తరువాత తొలిసారి ఆపిల్‌ భారీ అప్‌గ్రేడ్‌కు సిద్దమైంది. ఇదే ఈవెంట్‌లో ఆపిల్‌ మ్యాక్‌ మినీ అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌, ఫైనల్‌ వెర్షన్‌ ఆప్‌ మాక్‌ఓఎస్‌ను కూడా రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. 
చదవండి: Apple: సరికొత్త ఆఫర్‌...మనీ యాడ్‌ చేస్తే...20 శాతం బోనస్‌..!

గూగుల్‌ పిక్సెల్‌ 6 తో గూగుల్‌ రెడీ...!
ఎప్పుడెప్పడాని ఎదురుచూస్తోన్న గూగుల్‌ పిక్సెల్‌ 6 స్మార్ట్‌ఫోన్లను అక్టోబర్‌ 19 లాంచ్‌ చేయనుంది. ఈవెంట్‌లో భాగంగా పిక్సెల్‌ 6 స్మార్ట్‌ఫోన్లతో పాటుగా న్యూ పిక్సెల్‌ బడ్స్‌, పిక్సెల్‌ వాచ్‌ను రిలీజ్‌ చేయనుంది. పిక్సెల్‌ ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ కూడా లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ పిక్సెల్‌ 6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ కోసం యూజర్లు ఎదురుచూస్తున్నారు.

శాంసంగ్‌ అన్‌ప్యాక్‌డ్‌ పార్ట్‌-2
పిక్చర్‌ అబీ బాకీ హే మేరే దోస్త్‌ అంటూ శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ పార్ట్‌-2 ఈవెంట్‌ను తెరపైకి తెచ్చింది. శాంసంగ్‌ ఈ ఏడాది అన్‌ప్యాక్‌డ్‌ ఈవెంట్‌తో మార్కెట్లలోకి జెడ్‌ ఫోల్డ్‌ 3, జెడ్‌ ఫ్లిప్‌ 3 స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసిన  విషయం తెలిసిందే.

ప్రస్తుతం సెకండ్‌ ఎడిషన్‌ ఈవెంట్‌తో శాంసంగ్‌  కలర్‌ఫుల్‌ ఫ్లిప్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

సమరానికి సిద్దమైన దిగ్గజ కంపెనీలు..! గెలిచేది ఎవరో..?
వరుస ఈవెంట్లతో దిగ్గజ టెక్‌ కంపెనీలు సమరానికి సిధ్దమైయ్యాయి. ప్రపంచ స్మార్ట్ ఫోన్‌ మార్కెట్లలో ఆపిల్‌ తిరిగి రెండోస్థానాన్ని కైవసం చేసుకుని మరింత ఉత్సాహంతో ఉంది. మ్యాక్‌బుక్స్‌ లాంచింగ్‌ ఈవెంట్‌తో మరింత ఆదరణను పొందుతుందని ఆపిల్‌ భావిస్తోంది. అయితే కొంతమంది నిపుణులు గూగుల్‌ పిక్సెల్‌ 6 ఈవెంట్‌ కంటే ముందే రోజు ఈవెంట్‌ను ఏర్పాటు చేయడంలో ఆపిల్‌ కొంతమేర జంకినట్లుందని భావిస్తున్నారు. మరికొంత మందైతే గూగుల్‌ పిక్సెల్‌ 6 లాంచ్‌ ఈవెంట్‌కు పోటీగా ఆపిల్‌ ముందుకొచ్చిందని భావిస్తున్నారు.  ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ పిక్సెల్‌ 6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల కోసం యూజర్లు ఎదురుచూస్తున్నారు.  

శాంసంగ్‌ ఎప్పటిలాగే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని నిలుపుకుంది. శాంసంగ్‌ ఆన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌తో కలర్‌ ఫుల్‌ మడత ఫోన్లతో కొనుగోలుదారులను మరింత ఆకట్టుకునేందుకు సిద్దమైంది. ఏది ఏమైనా దిగ్గజ టెక్‌ కంపెనీల మధ్య పోటీ విషయంలో  కొనుగోలుదారులే కీలక పాత్ర వహిస్తారని టెక్నికల్‌ నిపుణులు భావిస్తున్నారు.   
చదవండి: డీమార్ట్‌ దెబ్బకు బిలియనీర్‌ అయిపోయాడే...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top