DMart: డీమార్ట్‌ దెబ్బకు బిలియనీర్‌ అయిపోయాడే...!

DMart CEO Ignatius Noronha Became Billionaire - Sakshi

డీమార్ట్‌ ఆకాశమే హద్దుగా రాకెట్‌లా దూసుకుపోతుంది. కొద్ది రోజుల క్రితమే డీమార్ట్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ రూ. 3 ట్రిలియన్‌ క్లబ్‌లోకి జాయిన్‌ విషయం తెలిసిందే.  డీమార్ట్‌ దూకుడుతో కంపెనీ వ్యవస్థాపకుడు రాధాకిషన్‌ దమానీ వరల్డ్‌ రిచెస్ట్‌ -100 బిలియనీర్‌ క్లబ్‌లోకి చేరారు. తాజాగా డీమార్ట్‌ సీఈవో ఇగ్నేషియస్‌ నావిల్‌ నోరోన్హా   బిలియనీర్‌గా అవతారమెత్తారు. కంపెనీ షేర్లు సోమవారం రోజున 10 శాతం పైగా పుంజుకోవడంతో నోరోన్హా బిలియనీర్‌గా మారారు.
చదవండి: గూగుల్‌ బ్రౌజర్‌ వార్నింగ్‌.. కోట్ల మంది దూరం? గూగుల్‌కే కోలుకోలేని నష్టం!

డీమార్ట్‌లో నోరోన్హా 2.02 శాతం వాటాను కల్గి ఉన్నారు. వాటి విలువ ఇప్పుడు రూ. 7,720 కోట్లకు చేరింది. ఇటీవలి కాలంలో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం...ఇగ్నేషియస్ నావిల్ నోరోన్హా భారత్‌లో అత్యంత ధనవంతులైన ప్రొఫెషనల్ మేనేజర్‌గా నిలిచారు.

డీమార్ట్‌లో చేరడానికి ముందు, నోరోన్హా ఫాస్ట్‌మూవింగ్‌ కన్యూసమర్‌ గూడ్స్‌(ఎఫ్‌ఎమ్‌సీజీ)దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్‌తో కలిసి పనిచేశారు. అవెన్యూ సూపర్‌మార్ట్స్ స్థాపించిన వెంటనే రాధాకిష్ణన్ దమాని 2004 లో నోరోన్హాను డీమార్ట్‌ సీఈవోగా నియమించారు. 

క్యూ-2 లో భారీ లాభాలు..!
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో డీమార్ట్‌ తన స్వతంత్ర ఆదాయంలో 46శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి ₹ 7,649.64 కోట్లకు చేరుకుంది. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం..డీమార్ట్‌ వృద్ధి నివేదిక  అంచనాల కంటే 5శాతం ఎక్కువ మేర లాభాలను గడించింది.
చదవండి: స్మార్ట్‌ఫోన్‌ ఆధిపత్యానికి చెక్‌! చైనాను ఇరకాటంలో నెట్టేలా భారత్‌ నిర్ణయం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top