గూగుల్‌ బ్రౌజర్‌ వార్నింగ్‌.. కోట్ల మంది దూరం? గూగుల్‌కే కోలుకోలేని నష్టం!

Google Warning For Billion Chrome Users To abandon Google Browser - Sakshi

ఏం అవసరం పడినా.. ఇంటర్నెట్‌లో వెతికే ఎక్కువమంది ఆశ్రయించేది గూగుల్‌ బ్రౌజర్‌నే. గూగుల్‌ రూపొందించిన ఈ క్రాస్‌ ప్లాట్‌ఫామ్‌ వెబ్‌ బ్రౌజర్‌ను..  రోజూ కొన్ని కోట్ల మంది ఉపయోగిస్తుంటారు. అలాంటిది తన స్వీయ తప్పిదంతో గూగుల్‌ వాళ్లందరినీ దూరం చేసుకోవాలని చూస్తుందా?!

‘సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి. గూగుల్‌ క్రోమ్‌ను అప్‌డేట్‌ చేసుకోండి’.. గత కొన్ని నెలలుగా తెర మీద వినిపిస్తున్న ప్రకటన ఇది.  స్వయంగా తన యూజర్ల కోసం గూగుల్‌ స్వయంగా చేసిన భారీ హెచ్చరిక ఇది.  సాధారణంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ఏవీ ఈ తరహా ప్రకటనలు చేయవు. కానీ, అందుకు విరుద్ధంగా గూగుల్‌ చేసిన ప్రకటన.. ఇప్పుడు గూగుల్‌కే డ్యామేజ్‌ చేయనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యూజర్ల భద్రత విషయంలో గత కొంతకాలంగా హెచ్చరికలు జారీ చేస్తున్న గూగుల్‌.. ఈమధ్య మరో అప్‌డేట్‌ ఇచ్చింది. 19 రకాల సెక్యూరిటీ సమస్యలను సైతం ఈ కొత్త క్రోమ్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ కావాలని కోట్ల మంది యూజర్లను కోరింది.  అంతేకాదు కాపీ లింక్స్‌, క్యూఆర్‌ కోడ్‌లను వెబ్‌సైట్లతో పంచుకునేందుకు సురక్షితమైన హబ్‌గా క్రోమ్‌ కొత్త వెర్షన్‌ను ప్రకటించుకుంది. అయితే గూగుల్‌ చేసిన ఈ ప్రకటన..  పరోక్షంగా తన యూజర్లను తానే దూరం చేసుకున్నట్లు అవుతుందని ‘ది రిజిస్ట్రర్‌’లో ఒక ఎడిటోరియల్‌ కథనం ప్రచురించింది. ఈ ప్రకటన ద్వారా గూగుల్‌ బ్రౌజర్‌ నుంచి కోట్ల మంది దూరం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

పైగా గూగుల్‌ చేస్తున్న సవరణలు.. మొత్తంగా ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ వ్యవస్థనే ప్రభావితం చేయనున్నాయట!. గూగుల్‌ అప్‌డేట్‌ వల్ల ఏం ఒరగకపోగా.. వెబ్‌సైట్‌ వ్యవస్థ నాశనం అవుతుందని సీనియర్‌ టెక్‌ ఎక్స్‌పర్ట్‌ స్కాట్‌ గిల్‌బర్ట్‌సన్‌ ఈ మేరకు  ఆ వ్యాసంలో పేర్కొన్నారు. అంతేకాదు గూగుల్‌ చర్యల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని, మొత్తంగా కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతింటుందని పేర్కొంది. వెబ్‌ అనేది కేవలం ప్రొఫెషనల్స్‌ డెవలపర్స్‌ కోసమే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొసమెరుపు ఏంటంటే.. గూగుల్‌ బ్రౌజర్‌ కంటే మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌ తన దృష్టిలో బెస్ట్‌ బ్రౌజర్‌ అంటూ స్కాట్‌ కామెంట్లు చేయడం.

చదవండి: గూగుల్‌ సంచలన నిర్ణయం.. మీ ప్రమేయం లేకుండానే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top