ఈ-మెయిల్‌ యాప్‌ను బ్లాక్‌ చేసిన యాపిల్‌.. కారణం ఇదే..

Apple Blocks Email App Bluemail That Uses Chatgpt - Sakshi

ఏఐ(కృత్రిమ మేధ) అనుసంధానంతో రూపొందించిన బ్లూమెయిల్‌ అనే ఈ-మెయిల్‌ యాప్‌ను యాపిల్‌ మొబైల్‌ సంస్థ నిషేధించింది. ఈ-మెయిల్‌కు చాట్‌జీపీటీని అనుసంధానించడం వల్ల పిల్లలు దీని నుంచి అనుచితమైన కంటెంట్‌ను పొందే ప్రమాదం ఉందన్న కారణంతో ఈ-మెయిల్ యాప్‌కి అప్‌డేట్‌ను ఆమోదించడాన్ని యాపిల్ ఆలస్యం చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం వెలువరించింది. 

ఓపెన్‌ ఏఐ సంస్థకు చెందిన జీపీటీ-3 లాంగ్వేజ్ మోడల్ కస్టమైజ్డ్ వెర్షన్‌ని ఉపయోగించి  బ్లూమెయిల్ తమ యాప్‌ను ఇటీవల అప్‌డేట్ చేసింది. అయితే ఆ అప్‌డేట్‌ను యాపిల్‌ ఆమోదించకుండా బ్లాక్‌ చేసిందని బ్లూమెయిల్ తయారీ సంస్థ బ్లిక్స్‌ సహ వ్యవస్థాపకుడు బెన్ వోలాచ్ చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

చదవండి: బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్‌.. ఇకపై ఇది తప్పనిసరి! 

చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ను ఉపయోగించుకుని మునుపటి ఈ-మెయిల్స్‌, ఈవెంట్‌ల కంటెంట్‌ ఆధారంగా ఆటోమేటిక్‌గా ఈ-మెయిల్‌ రాసేలా బ్లూమెయిల్‌ కొత్త ఫీచర్‌ను రూపొందించింది. ఇది మనుషుల మాదిరే ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవ్వడమే కాకుండా సుదీర్ఘ మెయిల్‌లను కూడా క్షణాల్లో రాయగలదు.

తమ ఈ-మెయిల్‌యాప్‌ అప్‌డేట్‌ను యాపిల్‌ ఆమోదించకుండా నిషేధించడంపై బ్లూమెయిల్‌  యాజమాన్యం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దావా కూడా వేసినట్లు పేర్కొంది.

చదవండి: మైక్రోసాఫ్ట్‌ కిచిడీ రెడీ! బిల్‌ గేట్స్‌కు స్మృతి ఇరానీ వంట పాఠాలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top