ఏపీజే ఎడ్యుకేషన్‌తో ఏడబ్ల్యూఎస్‌ జట్టు

APJ Education Tie up With AWS - Sakshi

న్యూఢిల్లీ: బోధన రంగంలో టెక్నాలజీని మరింత విస్తృతంగా వినియోగించుకోవడంలో విద్యా సంస్థలకు తోడ్పాటు అందించే దిశగా ఏపీజే ఎడ్యూకేషన్, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) కలిసి నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ యాక్సిలరేటర్‌ ప్రో గ్రాం (ఎన్‌ఈపీఏపీ)ను ఆవిష్కరించాయి. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యా రంగంలో పబ్లిక్‌ డిజిటల్‌ మౌలిక సదుపాయాల కల్పనకు ఇది తోడ్పడనుంది. విద్యా సంస్థల కు మార్గదర్శకత్వం వహించేందుకు ఎన్‌ఈపీఏపీ తోడ్పడగలదని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. 

విద్యా సంస్థల  సవాళ్లను గుర్తించి, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి టెక్నాలజీల సాయంతో పరిష్కార మార్గాలను రూపొందించడంలో ఎన్‌ఈపీఏపీ సహకారం అందిస్తుంది. అలాగే రిమోట్‌ లెర్నింగ్, ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ..మదింపు, మీడి యా సేవలు, కంటెంట్‌ డెలివరీ తదితర అంశాల్లో విద్యా సంస్థలకు అవసరమైన తోడ్పాటు అందిస్తుంది.  బోధన, అభ్యాసం, ప్లానింగ్, నిర్వహణ వంటి అంశాల్లో విస్తృతంగా టెక్నాలజీని ఉపయోగించడం .. వివిధ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్‌ చేసేలా విద్యా రంగంలో బహిరంగ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయడం అనే రెండు ప్రధాన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌ఈపీ 2020ని రూపొందించారు. 

చదవండి: అదానీ చేతికి హోల్సిమ్‌ ఇండియా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top