Shark Tank India: 13 ఏళ్ల విద్యార్థి.. ఔరా అనిపించే యాప్‌.. రూ.50 లక్షల ఫండింగ్‌

Anoushka Jolly After Becoming The Youngest Contestant On Shark Tank India - Sakshi

ఇటీవల సోషల్‌మీడియాలో షార్క్‌ ట్యాంక్‌ ఇండియా షో ఎక్కువగా ట్రెండ్‌ అవుతోంది. షార్క్‌ ట్యాంక్‌  ఇండియాకు చెందిన మీమ్స్‌, లైన్స్‌ బాగా ఫేమస్‌ అయ్యాయి. ఒకానొక సమయంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా విపక్షాలను షార్క్‌ ట్యాంక్‌ ఇండియాకు చెందిన మీమ్‌తో విమర్శించారు. అంతగా ఫేమస్‌ అయ్యింది షార్క్‌ ట్యాంక్‌ ఇండియా. ఈ షోలో పాల్గొన్న 13 ఏళ్ల అమ్మాయి  రూపొందించిన యాప్‌తో ఏకంగా 50 లక్షల ఫండింగ్‌ను సాధించి అందరితో ఔరా..! అనిపిస్తోన్న  ఎనిమిదో తరగతి అమ్మాయి గురించి తెలుసుకుందాం..!


 

చిన్న ఐడియానే..ఎంతో ఉపయోగంగా..!
చాలా మంది అమ్మాయిలు.. విద్యార్థినులు ఎన్నో సందర్భాల్లో వేధింపులు ఎదుర్కోవడం.. బెదిరింపులకు గురి అవుతూ ఉంటారు. నిస్సహాయ స్థితిలో ఉండి మౌనంగా వెళ్లిపోతుంటారు. వీరి కోసం అనౌష్క జాలీ అనే 13 ఏళ్ల విద్యార్థిని యాప్‌ను రూపోందించి రియాలిటీ షో షార్క్‌ ట్యాంక్‌ ఇండియాలో రివీల్‌ చేసింది. తన ఐడియాను షోలో రివీల్‌ చేసి భారీ మొత్తంలో ఫండింగ్ పొందింది. సుమారు ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా రూ. 50 లక్షల ఫండింగ్‌ను దక్కించుకుంది. 


 

చిచ్చర పిడుగు..అనౌష్క..!
అనౌష్క జాలీ వయస్సు 13 ఏళ్లు. ఆమె ఎనిమిదో తరగతి చదువుతోంది. అనౌష్క చిన్నతనంలో తన తోటీ విద్యార్ధిని వేధింపులకు గురైన విషయం గుర్తుంది. నిస్సహాస్థితిలో ఉండి, వేధింపులకు గురయ్యే వారి కోసం ఎదైనా చేయాలనే ఆలోచించింది అనౌష్క. వెంటనే తనకు వచ్చిన ఆలోచనతో ఎంతో మంది వేధింపులకు గురవుతున్న వారి కోసం అండగా నిలిచేందుకు యాప్‌ను తయారుచేసింది. ఎందరో విద్యార్థులకు ఆమె తయారు చేసిన యాప్‌ ఉపయోగపడుతోంది. తర్వాత  అనౌష్క జాలీ 'కవచ్' అనే మొబైల్ అప్లికేషన్‌ తయారు చేసింది. ఈ యాప్‌ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుంది. స్కూల్‌లో విద్యార్థినులు ఎవరైనా వేధిస్తే.. వెంటనే కంప్లైట్‌ చేయడానికి, ఇతరులను అలెర్ట్ చేయడానికి ఈ యాప్‌ ఉపయోగపడనుంది. 

కవచ్‌తో రక్షణ..!
అనౌష్క జాలీ 'కవచ్' అనే మొబైల్ అప్లికేషన్‌ తయారు చేసింది. ఈ యాప్‌ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుంది. స్కూల్‌లో విద్యార్థినులు ఎవరైనా వేధిస్తే.. వెంటనే కంప్లైట్‌ చేయడానికి, ఇతరులను అలెర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. షార్క్‌ ట్యాంక్‌ ఇండియా రియాలిటీ షోలో ఈ యాప్‌ గురించి పిచ్చింగ్‌ను ఇచ్చింది.  ఈ ఐడియాను  మెచ్చి అనౌష్కకు షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అనుపమ్ మిట్టల్, బోట్‌ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా రూ. 50 లక్షల ఫండింగ్‌ చేశాడు. 


 

షార్క్‌ ట్యాంక్‌ ఇండియా..!
పలు స్టార్టప్స్‌కు, మంచి ఐడియాతో వచ్చే ఎంట్రిప్యూనర్స్‌కు షార్క్‌ ట్యాంక్‌ ఇండియా ఫండింగ్‌ను అందిస్తోంది. ఇది ఒక బిజినెస్‌ రియాలిటీ షో. భారత్‌పే మేనేజింగ్ డైరెక్టర్ , సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్, boAt సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమన్ గుప్తా, Shaadi.com, పీపుల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సీఈవో అనుపమ్ మిట్టల్, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమితా థాపర్, MamaEarth సహ వ్యవస్థాపకుడు ,చీఫ్ గజల్ అలగ్, SUGAR సౌందర్య సాధనాల CEO, సహ వ్యవస్థాపకుడు వినీతా సింగ్, లెన్స్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పీయుష్‌ బన్సల్‌ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ షో 118 మంది స్టార్టప్స్‌కు మద్దతును అందించింది.

చదవండి: IPL Mega Auction 2022: వేలంలో ఫ్రాంఛైజీలకు ముచ్చెమటలు పట్టించిన తెలుగు తేజం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top