
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మరోసారి తన అభిమానులను ఫిదా చేశారు. క్రిస్మస్ సందర్భంగా ఒక అద్భుతమైన వీడియోతో అందరికీ శుభాకాంక్షలందించారు.
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మరోసారి తన అభిమానులను ఫిదా చేశారు. క్రిస్మస్ సందర్భంగా ఒక అద్భుతమైన వీడియోతో అందరికీ శుభాకాంక్షలందించారు. లక్షల పదాలకంటే ఈ వీడియో చాలా విలువైంది అంటూ ఒక వీడియోను ట్వీట్ చేశారు. తమకున్న దానితో సృజనాత్మకంగా పిల్లలంతా పండుగనుఎంజాయ్ చేస్తున్న ఈ ఆసక్తికరమైన వీడియోను విశేషంగా నిలుస్తోంది.
క్రిస్మస్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు భక్తులు ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో తమకున్న వనరులతో అత్యంత ఉత్సాహంగా పండుగ జరుపుకుంటున్న వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. సంతోషమనే ఫ్యాక్టరీకి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. దీనిపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాదు దాదాపు ఇలాంటి వీడియోతో రిప్లై ఇవ్వడం విశేషం.
Merry Christmas 🤶 enjoy this too it’s amazing 🤩 pic.twitter.com/AJYDnO04I7
— IamFaheem !! (@Idoneouss) December 25, 2021