breaking news
Merry Christmas 2021
-
ఆనంద్ మహీంద్ర అమేజింగ్ వీడియో
-
‘నానమ్మ’ బిల్లు కట్టి వెళ్లిపోయాడు.. ఇంతకీ అతడెవరు?
Merry Christmas 2021: ఆమె ఒక బామ్మ. క్రిస్మస్ షాపింగ్‌కు తన ముగ్గురు మనమరాళ్లతో షాపింగ్‌కు వెళ్లింది. వాళ్లతో మాట్లాడుతూ నవ్వుతూ దగ్గరకు తీసుకుంటూ షాపింగ్ చేసింది. బిల్లు పే చేయబోయే సమయానికి వెనుక ఉన్న యువకుడు ‘మీ బిల్లు నేను పే చేస్తాను. నా క్రిస్మస్ కానుక అనుకోండి’ అన్నాడు. ‘ఎలా ఎందుకు?’ అని ఆమె అడిగింది. దానికి అతడు ఏం సమాధానం చెప్పాడు? ఈ ఘటన యు.కెలో జరిగితే అమెరికాలో ఒక మనవరాలు ‘ఈ క్రిస్మస్కు నాకు నానమ్మతో హగ్ కావాలి’ అని కోరి ఇంట్లో పెద్దవాళ్ల అవసరాన్ని చెప్పింది. ఈ క్రిస్మస్ మన దేశంలో కూడా నానమ్మల, అమ్మమ్మల ఆత్మీయతల మధ్య జరగాలి. డిసెంబర్ 17. యు.కెలోని హెల్స్టన్ పట్టణం. బేవర్లీ కుక్ అనే బామ్మ తన ముగ్గురు మనవరాళ్లతో కలిసి సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. జనం రద్దీగా ఉన్నారు. క్రిస్మస్ షాపింగ్ జోరుగా జరుగుతోంది. బేవర్లీ కుక్ తన ముగ్గురు మనవరాళ్లతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ముద్దు చేస్తూ ఇంటికి కావాల్సినవి, వారికి కావాల్సినవి కొంటోంది. అంతా అయ్యాక సరుకుల బుట్టను బిల్లింగ్ దగ్గరకు తెచ్చేసరికి వెనుక ఉన్న యువకుడు ‘మీరేమీ అనుకోకపోతే మీ బిల్లు నేను కట్టనా?’ అన్నాడు. బామ్మ ఆశ్చర్యపోయింది. ‘ఎందుకు?’ అని అడిగింది. ‘మీ కుటుంబం చాలా బాగుంది. మీ మనవలు మీతో ఎంతో ప్రేమగా ఉన్నారు. మీరు కూడా వారితో. ఇలా కుటుంబాలు అందంగా ఉండాలి. అందుకే నేను మీ బిల్లు కడతాను. ఇది నా క్రిస్మిస్ కానుక అనుకోండి’ అన్నాడు. ఆమె సంతోషంగా అంగీకరించింది. ఆ యువకుడు మాస్క్ కట్టుకుని ఉన్నాడు. పేరు చెప్పలేదు. ముఖం చూపించలేదు. బిల్లు కట్టి వెళ్లిపోయాడు. బహుశా అతని కుటుంబంలో ఆ పరిపూర్ణత్వం లేదేమో. బేవర్లీ కుక్ ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా అందరికీ తెలిపినప్పుడు ఆ అజ్ఞాత యువకుడికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. బామ్మల ప్రేమ కుటుంబానికి అవసరం అని అతడు గుర్తించి అందరినీ గుర్తించేలా చేశాడని కామెంట్లు పెట్టారు. పెద్దవాళ్లు తాము జీవించి ఉండగానే చూసే అద్భుతాలు మనవలు, మనవరాళ్లు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు తాము తల్లిదండ్రులు అయినప్పుడు మురిసిపోతారో లేదో కాని అవ్వలు, తాతయ్యలు అయినప్పుడు పొంగిపోతారు. పిల్లలతో లేనంత గాఢ బంధం వారికి మనమలతో ఏర్పడుతుంది. కాని ఇవాళ ప్రపంచంలో చాలా మటుకు ఆ పెద్దవాళ్లకు మనవలతో, మనవరాళ్లతో గడిపే వీలు లేదు. కారణాలు అనేకం. కాని ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఉండటం ఇప్పుడు సంపూర్ణం అనుకునే రోజులు వచ్చాయి. పెద్దవాళ్లు ఉన్నప్పుడు కదా కుటుంబ చిత్రం సంపూర్ణం అయ్యేది. ఈ క్రిస్మస్ ఆ సంగతే గుర్తు చేస్తోంది. అమెరికాలోని ఉటా సిటీ. అమీలియా జోన్స్ అనే తల్లి తన ఆరేళ్ల కూతురిని ‘క్రిస్మస్ వస్తోంది కదా. శాంటా తాత నుంచి నీకేం కావాలో ఒక లిస్టు రాయి’ అంది. అప్పుడా చిన్నారి ‘ఒక పెట్, మెడికిల్ కిట్ కావాలి’ అని రాసి మూడో కోరికగా ‘నానమ్మ నుంచి హగ్’ అని కూడా లిస్ట్‌లో చేర్చింది. నానమ్మ నుంచి పండగపూట ఒక హగ్ కోరుకోవాల్సిన పరిస్థితిలో కుటుంబం బిజీగా ఉంది. ఆ అమ్మ వెంటనే ఆ విషయాన్ని అత్తగారితో చెప్తే ఆమె ఆఘమేఘాల మీద వచ్చింది. కళ్లకు గంతలు కట్టుకున్న పాపను ఆ నానమ్మ కన్నీళ్లతో కావలించుకుంది. పాప తన కళ్లకు గంతలు తీసి నానమ్మ మీద ముద్దులు కురిపించింది. పెద్దవాళ్లు మనల్ని ఆశీర్వదించే దేవతలు. ఈ క్రిస్మస్ ఆ పెద్దవాళ్లతో పూర్తి సమయం గడుపుతూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం. హ్యాపీ క్రిస్మస్. చదవండి: ఇలపై జనించిన కరుణ కిరణం -
ఆనందానికి ఇంతకంటే ఏం కావాలి, ఆనంద్ మహీంద్ర అమేజింగ్ వీడియో
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మరోసారి తన అభిమానులను ఫిదా చేశారు. క్రిస్మస్ సందర్భంగా ఒక అద్భుతమైన వీడియోతో అందరికీ శుభాకాంక్షలందించారు. లక్షల పదాలకంటే ఈ వీడియో చాలా విలువైంది అంటూ ఒక వీడియోను ట్వీట్ చేశారు. తమకున్న దానితో సృజనాత్మకంగా పిల్లలంతా పండుగనుఎంజాయ్ చేస్తున్న ఈ ఆసక్తికరమైన వీడియోను విశేషంగా నిలుస్తోంది. క్రిస్మస్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు భక్తులు ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో తమకున్న వనరులతో అత్యంత ఉత్సాహంగా పండుగ జరుపుకుంటున్న వీడియోను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. సంతోషమనే ఫ్యాక్టరీకి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. దీనిపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాదు దాదాపు ఇలాంటి వీడియోతో రిప్లై ఇవ్వడం విశేషం. Merry Christmas 🤶 enjoy this too it’s amazing 🤩 pic.twitter.com/AJYDnO04I7 — IamFaheem !! (@Idoneouss) December 25, 2021 -
ఇలపై జనించిన కరుణ కిరణం
‘చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహమందున...చెంత చేరను రండి సర్వజనాంగమా..సంతసమొందుమా!’ అని హృదయపూర్వకంగా కీర్తన పాడే సుదినం క్రిస్మస్. సర్వలోకాన్ని రక్షించడానికి ఈ లోకంలో బాలునిగా జన్మించిన యేసుక్రీస్తు ఆగమనాన్ని కీర్తించే సంతస దినం క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా నేడు కోట్లాదిమంది హృదయాల్లో ఆనందం పెల్లుబికే రోజు. ఇది చారిత్రాత్మక పర్వదినం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. తన మనస్సును దేవుని ప్రేమతో నింపుకొని పరిపూర్ణ ఆరాధనలో పరవశిస్తూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని మేల్కొలపాలనే ఆశతో నిండిన వ్యక్తి కలం నుండి జాలువారిన మాటలివి. ‘ఓ సద్భక్తులారా! లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాధిరాజు ప్రభువైన క్రీస్తుకు నమస్కరింప రండి... నమస్కరింప రండి’. చాలా సంవత్సరాల కిందట ఒక చర్చిలో పాత వస్తువులను వేలం పాటలో అమ్మేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ధనంతో చర్చిని మరింత కొత్తగా తీర్చిదిద్దాలని నాయకుల ఆలోచన. పాత బల్లలు, తివాచీలు, వస్తువులన్ని వేలానికి సిద్ధపరిచారు. ఏవో సంపాదించుకుందామన్న ఆలోచనతో కొందరు వేలం పాటకు చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని వస్తువులను వేలం వేయగా కొద్దో గొప్పో వెలను చెల్లించి వాటిని స్వంతం చేసుకున్నారు. చివరకు ఒక పాత పగిలిన వయోలిన్ ఉండిపోయింది. ఎంతసేపు గడిచినా దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాసేపటికి ఒక ముసలాయన ముందుకు వచ్చి సంఘ సేవకుణ్ణి ఆ వయోలిన్ తనకిమ్మని అడుగుతాడు. ఎంతోకాలంగా ఒక పక్కకు నెట్టివేయబడిన వయోలిన్‌ను అతడు అత్యద్భుతంగా ట్యూన్ చేసి దానిమీద ఒక క్రిస్మస్ పాటను ఇంపుగా వాయిస్తాడు. శ్రావ్యమైన స్వరాలను ఆ వయోలిన్ పలికించినప్పుడు దానిని కొనుక్కోవడానికి చాలా మంది ముందుకు వచ్చారు. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషిని బాగుచేసి సమసమాజ నిర్మాణంలో వాడుకోవాలన్న ఆకాంక్ష దేవుడు కలిగియున్నాడు. క్రిస్మస్ లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు అని దూత రాత్రివేళ పొలంలో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు శుభవార్తను తెలియచేసింది. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్ధం. తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని దూత మరియకు ప్రధానం చేయబడిన యోసేపు అనే వ్యక్తికి తెలిపింది. దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ఏ భేదము లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నారు అనేది లేఖన సత్యం (రోమా 2:23). పాపం దేవునికి మనిషిని దూరం చేసింది. అత్యున్నతుడైన దేవుని సమీపించకుండా మనిషి పాప క్రియలు అడ్డుకున్నాయి. పాపంలో నశించిపోతున్న మానవాళిని తన దివ్య ఆగమనం ద్వారా రక్షించాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్న ఆయన మాటలు మనిషి విజయానికి బాటలు వేశాయి. పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవునికి విముక్తి ప్రసాదించి తన ఔన్నత్యాన్ని వెల్లడిచేశాడు. క్రిస్మస్ దేవుడు మనకు సమీపంగా వచ్చాడన్న సందేశాన్ని జ్ఞాపకం చేస్తుంది. కన్యక గర్భవతియై కుమారుని కంటుంది. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని క్రీస్తు పుట్టుటకు కొన్ని వందల సంవత్సరాల ముందు యెషయా అనే ప్రవక్త ప్రవచించాడు. ఇమ్మానుయేలను మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. మనతో మనలో నివసించడానికి ప్రభువు ఇష్టపడి కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించాడు. మరియ యోసేపులు నజరేతు నుండి బేత్లెహేమునకు వచ్చినప్పుడు సత్రంలో వారికి స్థలం లేనందున యేసును కనిన తరువాత మరియ ఆయన్ను పశువుల తొట్టెలో పరుండబెట్టింది. ఊహకు అందని ఆశ్చర్యం అది. సర్వశక్తిగల దేవుడు భువిలో జన్మిస్తే ఆయన్ను పరుండబెట్టాల్సిన స్థలమా అది? అయితే ప్రభువైన దేవుడు పశువుల శాలలో మరియు తొట్టెలో పరుండబెట్టుట వలన మొదటిగా అతి సామాన్యులైన గొర్రెల కాపరులు నిర్భయంగా దర్శించగలిగారు. ఆ కాలంలో గొర్రెల కాపరులను చాలా తక్కువగా చూసేవారు. అలాంటి అభాగ్యులకు దేవుని దర్శన భాగ్యం కలిగింది. దేవుడు అందరికి సమీపంగా ఉండువాడు. ఆయన ఎవ్వరిని త్రోసివేయడు అన్న సత్యం మనుజాళికి ఎంతో ఊరట నిచ్చింది. జీవిత ద్వారాలు తెరిచి సందేహాలు మరిచి దేవున్ని తలిస్తే దేవుని స్పర్శను అనుభవించగలము. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. యేసును హృదయాల్లో ప్రతిష్టించుకున్న జనులందరికీ అవగతమయిన సత్యమది! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం, అది అనుభూతికి అందని అనుభవైక వేద్యం. అనుభవించే కొలది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం. అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకానీ ముగింపులేనిది. ఎన్నటికీ ముగియనిదీ నిన్ను వీడనిది. లోక రక్షకుడు పుట్టాడన్న వార్తను నక్షత్ర కదలిక ద్వారా తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శించాలన్న ఆశతో ప్రయాణం ప్రారంభించారు. ఓపికతో శ్రమపడితే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని నిరూపించారు. ఆకాశంలో కనువిందు చేసిన నక్షత్రం వారిని సృష్టికర్తయైన దేవుని దగ్గరకు వారిని నడిపించింది. ఆ సందర్భంలో వారు అత్యానందభరితులయ్యారు అని మత్తయి తన సువార్తలో వ్రాశాడు. దైవజ్ఞానపు తీరు అవగతమయిన సమయాన మనిషికి కలిగే ఆనందం వర్ణనాతీతం. నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించడంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించ గలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని స్వంతం చేసుకుంటే అంతకన్నా పరమార్ధం వేరే వుండదు. నాకు వద్దు అనుకుంటే వస్తుంది డబ్బు...కావాలనుకుంటే రావట్లేదు శాంతి సంతోషాలు అని ఒక అపర కుబేరుడు మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. భౌతిక అవసరాలు తీర్చబడితే చాలు ఎంతో సంతోషంతో ఆనందంతో జీవించవచ్చు అని చాలా అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఆనంద సంతోషాలు అనేవి భౌతిక విషయాలపై ఆధారపడి ఉండవు. అవి దేవుని సహవాసంలో మాత్రమే లభించే అమూల్య బహుమానాలు. తమ అంతరంగాలపై, వదనాలపై ప్రభువులోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగియుండే వారిలో అనిర్వచనీయమైన ఆనందం కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేలిన అహంకారం, అసూయ, స్వార్థం, సంకుచిత స్వభావం నశించిపోయి వారిలో నూతనత్వం విరాజిల్లుతుంది. క్రీస్తుకు తన హృదయంలో చోటివ్వడం ద్వారా తాను పొందిన అనుభూతిని ఒక వ్యక్తి ఇలా వర్ణిస్తాడు. ‘దేవుడే నా యిల్లు. గడచిన కాలమంతా అంతంలేని దారుల్లో అంధుడిలా నడిచాను. నాలో నేనేదో దేవులాడుకున్నాను. దరి చేర్చే దారి దొరక్క దుఃఖపడ్డాను. ఆశలు సమసి భయాలు ఆవరించినప్పుడు రక్షకుడైన క్రీస్తును దర్శించాను. ఆయన ప్రేమగల కౌగిల్లో జీవించాలని నిర్ణయించుకున్నాను. దేవుడే నాకు ఆనందంతో పాటు అన్నీ అనుగ్రహించాడు’. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్ధం. దేవుడు అందరికి సమీపంగా ఉండువాడు. ఆయన ఎవ్వరిని త్రోసివేయడు అన్న సత్యం మనుజాళికి ఎంతో ఊరట నిచ్చింది. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకానీ ముగింపులేనిది. ఎన్నటికీ ముగియనిదీ, నిన్ను వీడనిది. – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
Merry Christmas 2021: హ్యాపీ క్రిస్మస్.. చిన్నారులు
-
క్రిస్మస్ 2021: ఇవెంతో ప్రత్యేకం
క్రిస్మస్ పండుగ వచ్చేసింది. సర్వాంగసుందరంగా చర్చిలు ముస్తాబు అయ్యాయి. డచ్, పోర్చుగీసు, ఫ్రెంచ్, బ్రిటీష్.. ఇలా ఎన్నో కమ్యూనిటీలు మన దేశాన్ని పాలించాయి. కాలనీ కల్చర్ కారణంగా ఎన్నో అద్భుతమైన కట్టడాల్ని చూడగలుగుతున్నాం ఇప్పుడు. ఇందులో కొన్ని చర్చిలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటిలో కొన్నింటిని ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి కూడా. బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ గోవాలో ఉంది ఈ చర్చి. 1594లో నిర్మాణం మొదలై.. దశాబ్దాలకు పూర్తి చేసుకుంది. యూరప్ బారోక్యూ ఆర్కిటెక్చర్ నిర్మాణం ఇది. యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కూడా!. ఆల్ సెయింట్స్ చర్చ్ తమిళనాడు కున్నూర్‌లో ఉంది. 1854లో నిర్మించారు. అందమైన చెక్క ఇంటీరియర్‌తో ఆకట్టుకునేలా ఉంటుంది. అద్దాల కిటికీలు, పైన్ చెట్ల నడుమ.. ప్రశాంత వాతావరణం గల ప్రాంతంగా పేరు దక్కించుకుంది ఇది. శాంటా క్రూజ్ బాసిలికా కొచ్చి(కేరళ)లో ప్రధాన ఆకర్షణ ఈ చర్చి. నిర్మాణ కాలంపై స్పష్టత లేకున్నా.. పోర్చుగీస్ హయాంలో నిర్మించినట్లు తెలుస్తోంది. అందమైన చిత్రాలు ఈ చర్చికి ప్రధాన ఆకర్షణ. పరిమితమైన సమయాల్లో మాత్రమే ఈ చర్చిని సందర్శించేందుకు వీలుంటుంది. ఇమ్మాక్యూలేట్ కాన్సెప్షనల్ క్యాథెడ్రల్ పాండిచ్చేరి (పుదుచ్చేరి)లో ఉంది. 1686లో నిర్మించబడిన ఈ చర్చి.. పర్యాటకులను ప్రధానంగా ఆకర్షిస్తుంటోంది కూడా. సెయింట్ పీటర్స్‌కు అంకితమైన ఈ చర్చ్.. తొలినాళ్లలో ఛాపెల్(తక్కువ స్పేస్‌లో ప్రార్థనా స్థలం)గా ఉండేది. బ్రిటిష్ ఆక్రమణలో మిగిలింది ఈ చర్చి ఒక్కటే. వేలంకణ్ణి తమిళనాడులో ఉన్న సుందరమైన చర్చి ఇది. వేలంకణ్ణిలో ఉంది. బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ చర్చికి.. పోప్ ప్రకటన కూడా ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ఈ సుందర స్థలాన్ని చూడడానికి పర్యాటకులు తరలి వస్తుంటారు.