క్రిస్మస్‌ 2021: ఇవెంతో ప్రత్యేకం

Few Famous And Magnificent Churches in India - Sakshi

క్రిస్మస్‌ పండుగ వచ్చేసింది. సర్వాంగసుందరంగా చర్చిలు ముస్తాబు అయ్యాయి.  డచ్‌, పోర్చుగీసు, ఫ్రెంచ్‌, బ్రిటీష్‌.. ఇలా ఎన్నో కమ్యూనిటీలు మన దేశాన్ని పాలించాయి.  కాలనీ కల్చర్‌ కారణంగా ఎన్నో అద్భుతమైన కట్టడాల్ని చూడగలుగుతున్నాం ఇప్పుడు. ఇందులో కొన్ని చర్చిలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటిలో కొన్నింటిని ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి కూడా. 

బాసిలికా ఆఫ్‌ బోమ్‌ జీసస్‌
గోవాలో ఉంది ఈ చర్చి. 1594లో నిర్మాణం మొదలై.. దశాబ్దాలకు పూర్తి చేసుకుంది. యూరప్‌ బారోక్యూ ఆర్కిటెక్చర్‌ నిర్మాణం ఇది. యూనెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ గుర్తింపు కూడా!. 

ఆల్‌ సెయింట్స్‌ చర్చ్‌
తమిళనాడు కున్నూర్‌లో ఉంది. 1854లో నిర్మించారు. అందమైన చెక్క ఇంటీరియర్‌తో ఆకట్టుకునేలా ఉంటుంది. అద్దాల కిటికీలు, పైన్‌ చెట్ల నడుమ.. ప్రశాంత వాతావరణం గల ప్రాంతంగా పేరు దక్కించుకుంది ఇది.  

శాంటా క్రూజ్‌ బాసిలికా
కొచ్చి(కేరళ)లో ప్రధాన ఆకర్షణ ఈ చర్చి. నిర్మాణ కాలంపై స్పష్టత లేకున్నా..  పోర్చుగీస్‌ హయాంలో నిర్మించినట్లు తెలుస్తోంది. అందమైన చిత్రాలు ఈ చర్చికి ప్రధాన ఆకర్షణ. పరిమితమైన సమయాల్లో మాత్రమే ఈ చర్చిని సందర్శించేందుకు వీలుంటుంది. 

ఇమ్మాక్యూలేట్‌ కాన్సెప్షనల్‌ క్యాథెడ్రల్‌
పాండిచ్చేరి (పుదుచ్చేరి)లో ఉంది. 1686లో నిర్మించబడిన ఈ చర్చి.. పర్యాటకులను ప్రధానంగా ఆకర్షిస్తుంటోంది కూడా. సెయింట్‌ పీటర్స్‌కు అంకితమైన ఈ చర్చ్‌.. తొలినాళ్లలో ఛాపెల్‌(తక్కువ స్పేస్‌లో ప్రార్థనా స్థలం)గా ఉండేది. బ్రిటిష్‌ ఆక్రమణలో మిగిలింది ఈ చర్చి ఒక్కటే.   

వేలంకణ్ణి
తమిళనాడులో ఉన్న సుందరమైన చర్చి ఇది. వేలంకణ్ణిలో ఉంది. బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ చర్చికి.. పోప్‌ ప్రకటన కూడా ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ఈ సుందర స్థలాన్ని చూడడానికి పర్యాటకులు తరలి వస్తుంటారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top