Anand Mahindra: ఇలా ఎందుకు చేస్తారబ్బా? వీడియో వైరల్‌

Anand Mahindra reaction on Video of Indo Americans in Gold Ferrari - Sakshi

సాక్షి,ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. సాధారణంగా చలోక్తులు, ఆసక్తికర విషయాలు, విజ్ఞాన దాయక విషయాలనే  సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా వీటన్నింటికి భిన్నంగా ఆయన చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

తరుచూ ఆటో మొబైల్‌ పరిశ్రమలోని నూతన ఆవిష్కరణలపై స్పందించే ఆనంద్‌ మహీంద్రఅతి ఖరీదైన గోల్డెన్‌ ఫెరారీపై మాత్రం అసహనం వ్యక్తం చేశారు.  హంగూ, ఆర్భాటాలతో లగ్జరీ కారు ఓనరు హడావిడి, జనాల క్రేజ్‌పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వీడియోలను ఎందుకు చూస్తున్నారో తెలియదు, డబ్బును ఎలా ఖర్చుచేయకూడదో నెర్పే విషయం అయితే తప్ప అని వ్యాఖ్యానించారు. సంపద ఉంటే ప్రదర్శించాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటివి సోషల్‌ మీడియాలో ఎందుకు వైరల్‌ అవుతాయో అర్థం కాదంటూ విసుగు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన షేర్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది.  అయితే దీనిపై కొంతమంది నెటిజన్లు నెగిటివ్‌  కమెంట్లు కూడా చేశారు. 

ఆనంద్ మహీంద్రా ఆటోమొబైల్స్ ప్రపంచంలో వివిధ పరిణామాలపై తన అభిప్రాయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే ఇటీవల గ్రీన్ మొబిలిటీకి తన మద్దతు అంటూ రాబోయే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ట్విట్‌ చేశారు. వాస్తవానికి పూర్తిగా బంగారు పూత పూసిన  ఈ వీడియో  2017లో తొలిసారిగా వెలుగులోకి వచ్చింది.  సౌదీ నంబరు ప్లేట్‌తో  ఈ కారు నిజమైన యజమాని ఎవరు, అసలు యజమాని నుండి  ఈ కారును ఇండో-అమెరికన్‌ కొనుగోలు చేశారా అనేది స్పష్టత లేదు. కాగా ఇటలీకి చెందిన కార్ల కంపెనీ ఫెరారి  అత్యంత విలువ గల కార్లను ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top