ఐపీఎల్ కోసం అమెజాన్, రిలయన్స్ మధ్య యుద్ధం..!

Amazon, Reliance Set To Lock Horns Over IPL Broadcasting Rights - Sakshi

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు మరో జాక్‌పాట్‌ తగలబోతోందా? లీగ్‌ ప్రసార హక్కులు కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడుపోనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఐదేళ్ల కోసం ఐపీఎల్‌ ప్రసార హక్కుల ధర రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకూ పలుకుతుందని అంచనా. 2018 నుంచి 2022 వరకూ ఐదేళ్ల కాలానికిగానూ గతంలో రూ.16,347 కోట్లు చెల్లించి "స్టార్‌ ఇండియా" ఆ హక్కులను సొంతం చేసుకుంది. వచ్చే ఐదేళ్లకు అంతకంటే చాలా ఎక్కువ ధరే పలికే అవకాశాలున్నాయి.

అయితే, ఈసారి ఐపీఎల్‌ ప్రసార హక్కులను పొందడం కోసం కార్పొరేట్ కంపెనీల మధ్య పోటీ వాతావరణం ఏర్పడింది. కోట్ల మంది వీక్షించే ఇండియన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ ప్రసార హక్కుల కోసం అమెజాన్, రిలయన్స్, సోనీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈసారి  వచ్చే ఐదేళ్ల కోసం ఐపీఎల్‌ ప్రసార హక్కులు రికార్డు స్థాయిలో రూ.50 వేల కోట్ల వరకు పలికే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ, సాంప్రదాయ మీడియా సంస్థలు ఇప్పుడు భారతదేశం అతిపెద్ద రిటైలర్ రిలయన్స్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలతో గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. అమెజాన్, రిలయన్స్ ఇప్పటికే ఫ్యూచర్ గ్రూప్ ఆస్తుల విషయంలో కోర్టుల వరకు వెళ్లాయి.
 

రిలయన్స్ తన బ్రాడ్ కాస్టింగ్ జాయింట్ వెంచర్ వయాకామ్18 కోసం 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సేకరించడానికి విదేశీయులతో సహా ఇతర పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది. "ఈ బిడ్ గెలుచుకోవడం రిలయన్స్ జియో ప్లాట్ ఫారమ్, దాని డిజిటల్ విస్తరణ కోసం దీర్ఘకాలిక ప్రణాళికలలో కీలకం" అని కంపెనీకి చెందిన ఒక అధికారి తెలిపారు. ఇటీవల లైవ్ స్ట్రీమింగ్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రారంభించిన అమెజాన్ తన ప్లాట్ ఫామ్ యూజర్ బేస్ పెంచుకోవడానికి ఐపీఎల్‌ ప్రసార హక్కులను గెలుచుకోవాలని అనుకుంటుంది. ఈ కంపెనీకి టీవి ఫ్లాట్ ఫారం లేదు, టీవిలో క్రికెట్ ప్రసార కోసం మరో భాగస్వామితో చేతులు కలిపే అవకాశం ఉంటుంది. 

(చదవండి: సీనియర్‌ సిటిజన్లకు ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top