స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోన్న బెస్ట్‌ డీల్స్‌ ఇవే...!

Amazon Great Indian Festival Flipkart Big Billion Days 2021 Best Offers On Mobile Phones - Sakshi

Amazon Great Indian Festival Flipkart Big Billion Days 2021 Best Offers On Mobile Phones: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌’ ను ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను అక్టోబర్‌ 3 నుంచి ఒక నెల రోజుల పాటు అమెజాన్‌  నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ అక్టోబర్‌ 10 వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌  అందిస్తోన్న బెస్ట్‌ డీల్స్‌పై ఒక లుక్కేయండి...!
చదవండి: ప్రైమ్‌ యూజర్లకు బంపర్‌ఆఫర్‌ ప్రకటించిన అమెజాన్‌..!

స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌ అందిస్తోన్న బెస్ట్‌ డీల్స్‌...! 

ఆపిల్‌ ఐఫోన్‌ 11

  • గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో కొనుగోలుదారులకు ఐఫోన్‌ 11 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 38,999 కు లభించనుంది.  స్మార్ట్‌ఫోన్‌ ఎక్సేచేంజ్‌పై సుమారు రూ. 12,350 తక్షణ డిస్కౌంట్‌ను అమెజాన్‌ అందిస్తోంది. 64జీబీ ఆపిల్‌ ఐఫోన్‌ 11  స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 68,300.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ఎఫ్‌ఈ 5జీ

  • గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ఎఫ్‌ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ అత్యంత తక్కువ ధరలో రూ. 36,990 కే కొనుగోలుదారులకు   లభించనుంది. స్మార్ట్‌ఫోన్‌ ఎక్సేచేంజ్‌పై సుమారు రూ. 12,350 తక్షణ డిస్కౌంట్‌ను అమెజాన్‌ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 74,999.

ఆపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌

  • ఆపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ కొనుగోలుదారులకు రూ. 32,999కు లభించనుంది. ఎక్సేచేంజ్‌పై సుమారు రూ. 12,350 తక్షణ డిస్కౌంట్‌ను అమెజాన్‌ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 47,900.

ఐక్యూ  జెడ్‌3 5జీ

  • వివో సబ్‌ బ్రాండ్‌ ఐనా ఐక్యూ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ ఐక్యూ జెడ్‌3 5జీ స్మార్ట్‌ఫోన్‌ (6జీబీ+128 జీబీ) వేరియంట్‌ కొనుగోలుదారులకు రూ. 17,990 కే లభించనుంది. అంతేకాకుండా 9 నెలల నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ, ఆర్నెల్ల ఫ్రీ స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 22,990.

రెడ్‌మీ నోట్‌ 10ప్రో 

  • రెడ్‌మీనోట్‌ 10 ప్రో కొనుగోలుదారులకు రూ. 16,499 కే లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 19,999.

స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోన్న బెస్ట్‌ డీల్స్‌...! 

ఆపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ

  • బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఐఫోన్‌ ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు రూ. 26, 999 కు లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 39, 900.

గూగుల్‌ పిక్సెల్‌ 4ఏ

  • బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా గూగుల్‌ పిక్సెల్‌ 4ఏ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు రూ. 25,999 కు లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 31, 999.  ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్‌ బండిల్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. గూగుల్ నెస్ట్‌  ను కేవలం రూ. 1,  గూగుల్‌ పిక్సెల్‌ బడ్స్‌ ఏ సిరీస్‌ను కేవలం రూ. 4999కు అందించనుంది. అంతేకాకుండా కొనుగోలు సమయంలో యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డుపై 10 శాతం తక్షణ తగ్గింపు కూడా రానుంది.  

పోకో ఎక్స్‌ 3 ప్రో 

  • పోకో ఎక్స్‌ 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు రూ. 16,999కే అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 23, 999.

మోటోరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌

  • బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా మోటోరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ. 19,999కే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 24, 999. అంతేకాకుండా యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం మేర తక్షణ తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. 

చదవండి: యాక్సిస్‌ బ్యాంకుతో షాపింగ్‌ చేస్తే 45 శాతం మేర క్యాష్‌బ్యాక్‌...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top