Axis Bank Offers: యాక్సిస్‌ బ్యాంకుతో షాపింగ్‌ చేస్తే 45 శాతం మేర క్యాష్‌బ్యాక్‌...!

Axis Bank Offers 10 15 Percent Off On Flipkart Amazon - Sakshi

ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంకు ఖాతాదారులకు తీపి కబురును అందించింది. యాక్సిస్ బ్యాంక్ తన ఏఎస్‌ఏపీ డిజిటల్ సేవింగ్స్ నూతన బ్యాంక్ కస్టమర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ ,  అమెజాన్‌లో షాపింగ్‌ చేస్తే 10 నుంచి 15 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. అంతేకాకుండా 30 కంటే ఎక్కువ బ్రాండ్‌లపై 45 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను యాక్సిస్ బ్యాంక్ ఆన్‌లైన్ మార్కెట్‌ ప్లేస్‌లో "గ్రాబ్ డీల్స్" ద్వారా పొందవచ్చు.
చదవండి: వారంలో మూడు రోజులు పనిచేస్తే చాలు..! తెరపైకి మరో కొత్త పాలసీ

 ఎఏస్‌ఎపీ  డిజిటల్ సేవింగ్స్ ఖాతాల్లో భాగంగా ఈజీ, ప్రైమ్, ప్రయారిటీ,  బుర్గుండి పేరిట నాలుగు రకాల ఖాతాలను యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా  వీడియో కేవైసీ ప్రక్రియ ద్వారా బ్యాంక్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఖాతాదారులు ఖాతాలను తెరిచే సౌకర్యాన్ని యాక్సిస్‌ అందిస్తోంది. 

ఈజీ ఖాతాల డెబిట్ కార్డులపై  10 శాతం, ప్రైమ్‌ ఖాతాల డెబిట్‌ కార్డులపై  12.5 శాతం, ప్రయారిటీ అండ్‌ బుర్గుండీ ఖాతాలపై ఫ్లాట్ 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను యాక్సిస్‌ అందిస్తోంది. ఈ ఆఫర్‌ ఖాతాదారులకు  2021 నవంబర్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. కాగా ఈ ఆఫర్‌ కేవలం ఆర్నెల్లకుపైగా ఏఎస్‌ఏఎస్‌ ఖాతాలను కల్గిన వారికే వర్తించనుంది. క్యాష్‌బ్యాక్‌ను నేరుగా అకౌంట్లో జమా అవుతోందని యాక్సిస్‌ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. 
చదవండి: దేశంలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో స్టార్‌ లింక్‌ సేవలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top