వారంలో మూడు రోజులు పనిచేస్తే చాలు..! తెరపైకి మరో కొత్త పాలసీ

3 Day Work Week Bengaluru-Based Startup Offer To Attract Employees - Sakshi

3-Day Work Week: కరోనా రాకతో అన్ని కంపెనీలు వర్క్‌ ఫ్రంహోంకే జై కొట్టాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కాస్త తగ్గుముఖం పట్టింది. అదేవిధంగా భారీ ఎత్తున వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా మొదలైంది. దీంతో పలు కంపెనీలు వర్క్‌ఫ్రం హోంకు ఎండ్‌కార్డు పెడుతూ ఉద్యోగులను ఆఫీసులకు పిలుస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు నెలలో కొన్ని రోజులు ఆఫీసులకు వస్తే  సరిపోతుందంటూ పిలుపునిస్తున్నాయి. వర్క్‌ఫ్రంహోంకు క్లారిటీ రాకముందే ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ టీఏసీ సెక్యూరిటీస్‌ సరికొత్త వర్కింగ్‌ కాన్సెప్ట్‌ను ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. వారానికి నాలుగు రోజులు పనిచేస్తే సరిపోతుందంటూ టీఏసీ సెక్యూరిటీస్‌ సంస్థ ఉద్యోగులకు బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 
చదవండి: అగ్రరాజ్యాలకు పోటీగా నిలుస్తోన్న భారత్‌...!

మూడు రోజులు వస్తే చాలు..!
తాజాగా బెంగుళూరుకు చెందిన ఫిన్‌టెక్‌ సంస్థ స్లైస్‌ మరో అడుగు ముందుకేసి కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ ఉద్యోగులు వారంలో మూడు రోజులు పనిచేస్తే సరిపోతుందని  ​స్లైస్‌ వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ వ్యవస్ధాపకుడు రాజన్‌ బజాజ్‌ మాట్లాడుతూ...‘దిస్‌ ఈజ్‌ ద ఫ్యూచర్‌ ఆఫ్‌ ది వర్క్‌’ భవిష్యత్తులో ఇలాంటి వర్కింగ్‌ పాలసీలకే పలు కంపెనీలు మొగ్గుచూపుతాయన్నారు. ఈ సరికొత్త విధానంతో ఉద్యోగులను కేవలం జాబ్‌కే కట్టిపాడేయకుండా వారికి మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి దోహదం చేస్తోందని అభిప్రాయపడ్డారు. స్లైస్‌లో సుమారు 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కొత్త పాలసీతో రాబోయే మూడేళ్లలో కొత్తగా వెయ్యి మందిని రిక్రూట్‌ చేసుకోవాలని స్లైన్‌ భావిస్తోంది.   

భారీ పెట్టుబడులు..భారీ ఒత్తిడి..!
గ్లోబల్ ఇన్వెస్టర్లు భారత టెక్ స్టార్టప్‌లపై బిలియన్ డాలర్లను కుమ్మరిస్తున్నాయి. దీంతో పలు స్టార్టప్‌ల్లో వేగవంతంగా పనిచేసేందుకు స్టార్టప్‌ యాజమానులు ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నుట్లు తెలుస్తోంది. దీంతో ఆఫీసులో ఉద్యోగుల పనితీరు,మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం తదితర అంశాల భారీ ప్రభావం పడుతుంది. ఆఫీస్‌ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేయడంలో ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  అందులో చాలా మంది ఆఫీసు జీవితంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేయడంలో ఉద్యోగులు ఫెయిల్‌ అవుతున్నారు. 
చదవండి: ఆ వెబ్‌సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top