అత్యంత విలువైన కంపెనీగా 'అమెజాన్'.. భారత్ నుంచి 'టాటా' టాప్

Amazon Back As World Most Valued Brand - Sakshi

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రపంచ వ్యాప్తంగా అంత్యత విలువైన కంపెనీల జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకుంది. అయితే మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా అమెజాన్‌ 15 శాతం మార్కెట్‌ వ్యాల్యూని కోల్పోయి 350.3 బిలియన్‌ డాలర్ల నుంచి 299.3 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అయినా అమెజాన్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. 

బ్రాండ్‌ ఫైనాన్స్‌ సంస్థ గ్లోబల్‌ 500 2023 పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లో అమెజాన్‌కు నెంబర్‌ వన్‌ స్థానాన్ని కట్టబెట్టింది. ఫోర్బ్స్‌ గణాంకాల ప్రకారం.. గతేడాది అమెజాన్‌ ఏకంగా 50 బిలియన్‌ డాలర్లు నష్టపోయింది.

ఇక, విలువైన కంపెనీల జాబితాలో యాపిల్‌ రెండో స్థానంలో నిలిచింది. గతేడాది 355 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఈ కంపెనీ విలువ 16 శాతం క్షీణించి 297.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. భారత్‌కు చెందిన కంపెనీల్లో టాటా గ్రూప్‌ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 78వ స్థానంలో ఉన్న ఈ గ్రూప్‌ తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 69కి చేరింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top