గతిశక్తి పోర్టల్‌తో విద్యుత్‌ పంపిణీ లైన్ల అనుసంధానం

All existing inter-state power transmission lines mapped on PM GatiShakti portal - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చే దిశగా ప్రస్తుతం ఉన్న అన్ని అంతర్‌రాష్ట్ర పంపిణీ వ్యవస్థ లైన్లను (ఐఎస్‌టీఎస్‌) పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ (ఎన్‌ఎంపీ) పోర్టల్‌కు అనుసంధానం చేసినట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ వెల్లడించింది. అలాగే, నిర్మాణంలో ఉన్న లైన్లలో 90 శాతం లైన్లను కూడా అనుసంధానించినట్లు వివరించింది.

రూట్‌ సర్వే తర్వాత మిగతా వాటిపై కూడా దృష్టి పెట్టనున్నట్లు విద్యుత్‌ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో లైన్ల ప్లానింగ్, టెండరింగ్, అమలు, అనుమతుల ప్రక్రియలు సులభతరం అవుతాయని వివరించింది. హైవేలు, రైల్వేలు, ఏవియేషన్, గ్యాస్, విద్యుత్‌ పంపిణీ, పునరుత్పాదక విద్యుత్‌ తదితర రంగాలను అనుసంధానం చేయడం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనను మరింత మెరుగుపర్చే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆక్టోబర్‌లో పీఎం గతిశక్తి ఎన్‌ఎంపీని ఆవిష్కరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top