Alibaba: అత్యాచార బాధితురాలికి అండగా పోస్టులు.. పది మంది ఎంప్లాయిస్‌ డిస్మిస్‌

Alibaba Dismiss Employees Over Sexual Assault Accusations Leak - Sakshi

చైనా ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అలీబాబాను లైంగిక ఆరోపణల పర్వం కుదిపేస్తోంది. ప్రతీ ఏడాది ఆరోపణల కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ మహిళా ఉద్యోగిణినిపై మేనేజర్‌ లెవల్‌ అధికారి, ఓ క్లయింట్‌ లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించిన వాస్తవాల్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు పది మంది ఉద్యోగులపై వేటు వేసింది కంపెనీ. 
 
క్రమశిక్షణ చర్యల పేరుతో అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ కిందటి వారం పది మందిని డిస్మిస్‌ చేసింది. అయితే వాళ్లంతా అత్యాచార బాధితురాలికి మద్దతుగా పోస్ట్‌లు చేసినందుకే ఇదంతా జరిగిందని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ మేనేజర్‌, క్లయింట్‌ ఇద్దరూ తనను ఓ బిజినెస్‌ ట్రిప్‌లో వేధించారని, బలవంతంగా మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారని గతంలో ఆమె ఆరోపించింది. దీంతో ఆరోపణలపై నిజాలు తేలేదాకా ఆ మేనేజర్‌పై వేటు వేశారు. క్లిక్‌ చేయండి: బిజినెస్‌ బిల్డప్‌ బాబాయ్‌

ఈ తరుణంలో ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను కంపెనీ అంతర్గత ఫోరమ్‌లో షేర్‌ చేశారు పది మంది ఉద్యోగులు.  తిరిగి ఆ మేనేజర్‌ను విధుల్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నందునే బాధితురాలికి న్యాయం జరగదనే ఉద్దేశంతోనే ఆ పని చేసినట్లు వాళ్లు వివరణ కూడా ఇచ్చారు. అయితే కంపెనీ మాత్రం విషయం బయటకు పొక్కేలా చేసినందుకు వాళ్లపై వేటు వేసింది. మొత్తం రెండున్నర లక్షల ఉద్యోగులున్న అలీబాబా కంపెనీలో.. 2020లో ముప్ఫై మందికిపైగా ఉద్యోగిణులు.. తమ బాస్‌లపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం విశేషం.

చదవండి: జియో వర్సెస్‌ ఎయిర్‌టెల్‌.. గూగుల్‌ షాకింగ్‌ నిర్ణయం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top