ఈ అలారంతో ఉదయం నిద్ర లేవాల్సిందే

మీరు పోద్దున లేవాలనుకున్న లేవలేక పోతున్నారా? ఒక వేళా లేసిన మళ్ళి నిద్రపోతున్నారా?. అయితే మీకు గుడ్ న్యూస్.. అలాంటి వాళ్ల కోసం ఒక యాప్ లాంచ్ అయింది. దాని పేరే ‘ఛాలెంజెస్ అలారం క్లాక్– వేకప్ పజిల్స్’ అనే అలారం యాప్. ఇది అన్ని అలారంల లాగా టైం రిమైండ్ చేయదు ఈ యాప్. ఒక వేళా అన్ని యాప్ లలాగే లేసి ఆఫ్ చేసి పడుకుందామన్నా ఊరుకోదు. ఒకసారి ఈ యాప్లో అలారం పెడితే మళ్ళి ఆఫ్ చేయాలంటే గణిత, జ్ఞాపకశక్తి, సీక్వెన్స్, రీటైప్, పిక్చర్, స్మైల్ కు సంబందించిన ఒక పజిల్ ని సాల్వ్ చేయాలి. దాంతో ఆటోమేటిక్గా నిద్రమత్తు వదలడంతో పాటు మీ మెదడు కూడా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఈ యాప్లో అలారం సెట్ చేయడానికి ముందే ఛాలెంజెస్, గేమ్స్ని సెలక్ట్ చేసుకోవాలి. ఈ యాప్ విద్యార్థులకు, ఉద్యోగులకు బాగా పనిచేస్తుంది. దీనికోసం మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మీకు గూగుల్ ప్లేస్టోర్ లో ఉచితంగా లభిస్తుంది. (చదవండి: వివో నుండి మరో బడ్జెట్ ఫోన్)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి