Airtel: వారికోసం సరికొత్త ప్లాన్లను ప్రకటించిన ఎయిర్‌టెల్‌..!

Airtel Ties Up With Google Cloud Cisco To Launch Airtel Office Internet - Sakshi

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ పలు దిగ్గజ ఐటీ కంపెనీలతో జత కట్టనుంది. గూగుల్‌ క్లౌడ్‌, సిస్కో కంపెనీల భాగస్వామ్యంతో ‘ఎయిర్‌టెల్‌ ఆఫీస్‌ ఇంటర్నెట్‌’ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలను ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేసింది.  అభివృద్ధి చెందుతున్న చిన్న వ్యాపార సంస్థల కోసం, ప్రారంభ దశలో ఉన్న టెక్ స్టార్టప్‌ కంపెనీల డిజిటల్ కనెక్టివిటీ అవసరాల కోసం ఏకీకృత ఎంటర్‌ప్రైజ్  బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది.

ఎయిర్‌టెల్‌ ఆఫీస్‌ ఇంటర్నెట్‌ ప్లాన్‌ ధరలు రూ. 999 నుంచి ప్రారంభమవ్వనున్నాయి. ఎయిర్‌టెల్‌ ఇంటర్నెట్‌ సేవల్లో భాగంగా అనేక రకాల యాడ్‌ ఆన్‌ సేవలను కూడా పొందవచ్చును. చిన్న వ్యాపార సంస్థలు డిజిటల్‌ ట్రాన్సఫర్మేషన్‌ అందిపుచ్చుకోవడానికి ఎయిర్‌టెల్‌ ఆఫీస్‌ ఇంటర్నెట్‌ ప్లాన్‌ ఎంతగానో ఉపయోగపడనుందని కంపెనీ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ పేర్కొన్నారు. ఎయిర్‌టెల్‌ ఆఫీస్‌ ఇంటర్నెట్‌ ప్లాన్‌లు ‘వన్‌ ప్లాన్‌, వన్‌ బిల్‌’తో ఏకీకృత పరిష్కారాలను చూపిస్తోందని వెల్లడించారు.

ఎయిర్‌టెల్‌ ఆఫీస్‌ ఇంటర్నెట్‌ ప్లాన్‌ సేవలు...
ఆఫీస్‌ ఇంటర్నెట్‌ ప్లాన్‌లో భాగంగా వ్యాపార సంస్థలకు, టెక్‌ స్టార్టప్‌ కంపెనీలకు అపరిమిత లోకల్/ఎస్‌టీడీ కాలింగ్‌తో పాటు 1జీబీపీఎస్‌ వరకు అధిక వేగంతో ఎఫ్‌టీటీహెచ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ఇవ్వనుంది. ఎయిర్‌టెల్‌ ఆఫీస్‌ ఇంటర్నెట్‌ ప్లాన్‌లో భాగంగా గూగుల్‌ వర్క్‌స్పేస్‌ లైసెన్స్‌ను, డీఎన్‌ఎస్‌ సెక్యూరిటీ బై సిస్కో, ఫ్రీ ప్యారలల్‌ రింగింగ్‌ సర్వీసులను ఎయిర్‌టెల్‌ అందిస్తోంది.

హానికరమైన, అవాంఛిత డొమైన్‌లు, వైరస్‌లు, సైబర్‌దాడుల నుంచి ఆయా వ్యాపార సంస్థలకు భద్రతను సిస్కో, కాస్పర్‌స్కై అందించనున్నాయి. ఎయిర్‌ తన కస్టమర్ల భద్రత కోసం కొద్ది రోజుల క్రితమే కాస్పర్‌స్కైతో చేతులను కలిపింది.  ఎయిర్‌టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ హెచ్‌డీ నాణ్యతతో అపరిమిత,  సురక్షితమైన కాన్ఫరెన్సింగ్ వీడియో కాలింగ్‌ కోసం ఉచితంగా ఎయిర్‌టెల్ బ్లూజీన్స్ లైసెన్స్‌ను కూడా ఎయిర్‌టెల్‌ అందిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top