ఎయిర్‌టెల్‌ మనీ లండన్‌లో లిస్టింగ్‌  | Airtel Money IPO on the London Stock Exchange | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ మనీ లండన్‌లో లిస్టింగ్‌ 

Oct 10 2026 5:06 AM | Updated on Oct 10 2026 5:06 AM

Airtel Money IPO on the London Stock Exchange

షేరుకి రూ. 1.96 పౌండ్ల ధరలో ఐపీవో 

2019లోనే లిస్టయిన ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా

న్యూఢిల్లీ: ఆఫ్రికాలోని డిజిటల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసుల ప్లాట్‌ఫామ్‌ ఎయిర్‌టెల్‌ మనీ తాజాగా లండన్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీ (ఎల్‌ఎస్‌ఈ)లో లిస్టయ్యింది. తద్వారా యూకే మార్కెట్లో దీర్ఘకాలంగా భారతీ ఎంటర్‌ప్రైజెస్‌కు గల పెట్టుబడుల ఆసక్తికి ప్రోత్సా హాన్నిచ్చినట్లు ఎయిర్‌టెల్, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ వ్యాఖ్యానించారు. 

ఎల్‌ఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌ మనీ విజయవంత లిస్టింగ్‌ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే పెట్టుబడులకు యూకే ఆకర్షణీయ మార్కెట్‌కాగా.. తాజా లిస్టింగ్‌ తమ విశ్వాసానికి మరింత బలాన్నిచ్చినట్లు పేర్కొన్నారు. అనుబంధ సంస్థ ద్వారా 2024లో బీటీ గ్రూప్‌లో 24.5% వాటా కొనుగోలు చేయడం, 2020లో యుటెల్‌శాట్‌ (గతంలో వన్‌వెబ్‌)లో యూకే ప్రభుత్వంతోపాటు వాటాను పొందడం, ఆతిథ్య రంగ కంపెనీ స్కాటిష్‌ రిసార్ట్‌ గ్లెనీజెల్స్‌లో పెట్టుబడులు తదితరాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

యూకే ఇన్వెస్టర్ల ఆధారంగా 2019లో ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాను ఎల్‌ఎస్‌ఈలో లిస్ట్‌ చేసినట్లు చెప్పారు. ఎల్‌ఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌ మనీ కండిషనల్‌ ట్రేడింగ్‌ ద్వారా లిస్టయ్యింది. ఆఫర్‌ ధర షేరుకి 1.96 పౌండ్లుకాగా.. తొలి దశ ట్రేడింగ్‌లో గరిష్టంగా 2 పౌండ్లు, కనిష్టంగా 1.94 పౌండ్లను తాకింది. మార్కెట్‌ విలువ 5.3 బిలియన్‌ పౌండ్ల (7 బి. డాలర్లు)కు చేరింది. ఈ నెల 14 నుంచి అన్‌కండిషనల్‌ విధానంలో ట్రేడవుతుంది. ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాలో భారతీ ఎయిర్‌టెల్‌ వాటా 79.2% కాగా.. ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాకు ఎయిర్‌టెల్‌ మనీలో 77.85% వాటా ఉంది. వెరసి ఎయిర్‌టెల్‌ మనీలో  ఎయిర్‌టెల్‌కు పరోక్షంగా 61.6% వాటా లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement