ఆధార్‌ కార్డ్‌లో ఆ అప్‌డేట్‌ చాలా ముఖ్యం, చేయకపోతే చిక్కులు తప్పవ్‌!

Aadhar Card Update Or Correction,need To Follow These Simple Steps - Sakshi

ఆధార్ కార్డ్..  ఇటీవల ప్రజలకు ఇది గుర్తింపు కార్డ్‌లా మాత్రమే కాకుండా జీవితంలో ఓ భాగమైందనే చెప్పాలి. ఎందుకంటే బ్యాంకు అకౌంట్‌ తెరవడం, పర్సనల్‌, ఇంటి రుణాల కోసం, సంక్షేమ పథకాల కోసం, ఉద్యోగం కోసం.. ఇలా చెప్తూ పోతే పెద్ద జాబితానే ఉంది. ఆర్థిక లావాదేవీలలో ముఖ్యమైన బ్యాంక్‌, పాన్‌ కార్డ్‌లకు ఆధార్‌ కార్డ్‌ని అనుసంధానించిన తర్వాత దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది.

అందుకే ఈ కార్డులో ఏ తప్పులు లేకుండా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కార్డుదారులు ఆఫర్లు, సర్వీస్‌లను, లేదా మొబైల్‌ పోయిన తరచూ ఫోన్‌ నెంబర్లను మారుస్తుంటారు. ఆ తర్వాత ఏదో పనిలో పని కొత్త నెంబర్‌ను ఆధార్‌లో అప్‌డేట్ చేయడం మరిచిపోతుంటారు. ఆపై భవిష్యత్తులో డిజిటల్ బ్యాంక్ అకౌంట్స్, డీమ్యాట్ అకౌంట్స్ వంటితో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబందించిన వాటిలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఇబ్బందులు రాకుండా ఆధార్‌లో ఫోన్ నంబర్ ఈ విధంగా ఈజీగా అప్‌డేట్ చేసేయండి.

1: ముందుగా, మీరు అధికారిక UIDAI వెబ్‌సైట్ లేదా మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని వెళ్లాల్సి ఉంటుంది.

2: ఆపై ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో అధికారిక ఎగ్జిక్యూటివ్‌ని కలిసి అతని వద్ద నుంచి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారంని తీసుకోవాలి.

3: ఎగ్జిక్యూటివ్‌కు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారంను నింపి, సమర్పించాలి.

4: ఎగ్జిక్యూటివ్ బయోమెట్రిక్ సమాచారం ద్వారా మీ వివరాలను ధృవీకరిస్తారు.

5: మీ కొత్త ఫోన్ నంబర్ వివరాలు, లేదా మీరు కోరిన విధంగా మార్పులు చేస్తాడు.

6: ఈ మార్పులను ఆధార్ అధికారిక సైట్‌లలో అప్‌డేట్ చేశాక, ఈ సేవకు రుసుము చెల్లించాలి.

7: మీరు సంబంధిత అధికారి నుంచి అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ పొందుతారు. ఆ స్లిప్‌లో ఒక అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఉంటుంది. దీని ద్వారా మీ ఆధార్ కార్డు రిక్వెస్ట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు.

చివరగా మీ ఫోన్ నంబర్ అప్‌డేట్ లేదా మీ వివరాలు అప్‌డేట్‌ అయిన తర్వాత, మీరు అధికారిక UIDAI వెబ్‌సైట్ నుంచి ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆపై రుసుము చెల్లించి ఆధార్ కార్డ్‌ PVC ప్రింట్‌ను కూడా ఆర్డర్ చేయవచ్చు.

చదవండి: దీపావళి కళ్లు చెదిరే అఫర్లు.. కారు కొంటే రూ.లక్ష తగ్గింపు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top