బ్రిటన్‌ ప్రధానమంత్రిగా రిషి సునాక్‌, యూకేలో క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత?

57th Prime Minister Of The Uk Rishi Sunak Crypto Enthusiast - Sakshi

బ్రిటన్‌ 47వ నూతన ప్రధానిగా రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టడంతో ఆదేశంలో క్రిప్టో కరెన్సీపై మరోసారి చర్చ మొదలైంది. క్రిప్టో కరెన్సీని ఆర్ధిక వ్యవస్థలో భాగం చేసేందుకు సునాక్‌ డిజిటల్‌ కరెన్సీని చట్టబద్ధత కల్పించే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

బిట్‌కాయిన్‌ వినియోగించాలనుకునే వారిలో రిషి సునాక్‌ సైతం ఉన్నారు. 500 ఏళ్లుగా ఆర్ధిక స్థిరత్వానికి కంచుకోటగా ఉన్న బ్రిటన్‌ గడ్డు పరిస్థితుల్లోకి జారుకుంది. దీంతో ఆర్ధిక నిపుణుడైన సునక్..దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కే దిశగా ప్రయత్నాలు చేశారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఛాన్సలర్‌గా ఉన్న సమయంలో యూకేని క్రిప్టోకరెన్సీకి కేంద్రంగా మార్చాలనే తన కోరికను వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే క్రిప్టో నిపుణులు యూకే ప్రధానిగా సునక్ ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

బోరిస్ జాన్సన్ ప్రధానిగా పాలన పగ్గాలు నిర్వహిస్తున్న సమయంలో సునక్‌ స్టేబుల్‌కాయిన్‌లకు సంబంధించిన నియంత్రణ సంస్కరణలను ప్రతిపాదించారు. క్రిప‍్టో అసెట్స్‌ టెక్నాలజీ హబ్‌గా యూకేని మార్చడం నా ఆశయం. మేం పెట్టిన ప్రతిపాదనలు సంస్థలు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సహాయ పడతాయని నాడు ఓ సందర్భంలో అన్నారు.   

2021లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ), లేదా ‘బ్రిట్‌కాయిన్’ ను  2025 చివరి నాటికి యూకే ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలని సునక్‌ ప్రతిపాదించారు. ప్రయోజనాల్ని హైలెట్‌ చేశారు. ప్రభుత్వం రెండుసార్లు మారడం వల్ల సునాక్ క్రిప్టో ప్లాన్‌లు వాయిదా పడింది. అయితే, ఇప్పుడు సునక్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో క్రిప్టో కరెన్సీని యూకే దేశ ఆర్థిక వ్యవస్థలో భాగం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top