
ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జీఎస్‌టీ (GST) వసూళ్లు జూలై 2025లో రూ. 1,95,735 కోట్లు. ఇది జూలై 2024తో (రూ.1,82,075 కోట్లు) పోలిస్తే 7.5% పెరుగుదలను సూచిస్తుంది. వరుసగా ఏడవ నెల రూ.1.8 లక్షల కోట్లకు పైన జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి.
ఏప్రిల్‌లో స్థూల జీఎస్‌టీ వసూళ్లు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి, కానీ మే నెలలో రూ.2.01 లక్షల కోట్లకు తగ్గాయి. జూలైలో నికర దేశీయ ఆదాయం 0.2 శాతం తగ్గింది, నికర మొత్తం వసూళ్లు కేవలం 1.7 శాతం పెరిగి రూ.1.69 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ట్రంప్ భారతదేశంపై విధించిన అధిక సుంకాలు.. వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ సుంకాల కారణంగా వృద్ధి 0.3 శాతం పాయింట్ల తగ్గుదలను కలిగి ఉంటుందని ఆగస్టు 1న ఆర్థికవేత్తలు గుర్తించారు. భారతదేశానికి కేటాయించిన 25 శాతం సుంకాలు చాలా ఆసియా ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా ఉన్నాయి.