హల్‌చల్‌ చేస్తోన్న యమహా సరికొత్త బైక్‌..! ధర  ఎంతంటే..? 

2022 Yamaha mt 15 2 0 Launched in India - Sakshi

ప్రముఖ టూవీలర్‌ దిగ్గజం యహహా మోటార్స్‌ భారత మార్కెట్లలోకి న్యూ జనరేషన్‌ యమహా ఎంటీ15 వీ2.0 బైక్‌ను లాంచ్‌ చేసింది. ఈ బైక్‌ను యమహా ఆర్‌15 వీ4 బైక్‌ ఆధారంగా రూపొందించారు. 

డిజైన్‌, ఫీచర్స్‌లో కొత్తగా..!
2022 యమహా MT15 వీ2.0 డిజైన్స్‌లో సరికొత్త లుక్స్‌తో రానుంది. 2022 MT-15 సియాన్ స్టార్మ్ , రేసింగ్ బ్లూ , ఐస్ ఫ్లూ-వెర్మిలియన్, మెటాలిక్ బ్లాక్  అనే నాలుగు కలర్‌ అప్షన్స్‌తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.  సింగిల్-పాడ్ ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌తో సహా, కనుబొమ్మల ఆకారంలో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌తో రానుంది. మస్కులర్ బాడీవర్క్, రైజ్డ్ టెయిల్ సెక్షన్, సైడ్-స్లంగ్ అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ మఫ్లర్స్‌తో  2022 యమహా MT15 వీ2.0 స్టైలింగ్స్‌లో హైలైట్‌గా నిలుస్తోంది.

ఈ బైక్‌లో పలు స్పెక్ హార్డ్‌వేర్ అప్‌డేట్స్‌, కొత్త ఫ్రంట్ ఫోర్క్‌తో రానుంది. బ్రేకింగ్‌ సిస్టమ్‌లో సింగిల్-ఛానల్ ఏబీఎస్‌  బదులుగా డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో రానుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో  కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా యమహా Y-కనెక్ట్ యాప్‌ను మద్దతు ఇస్తుంది. ఈ బైక్‌లో కొత్తగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, సైడ్-స్టాండ్ ఇంజిన్ ఇన్హిబిటర్, రెగ్యులర్ క్విక్-షిఫ్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు. 

ఇంజిన్‌ విషయానికి వస్తే..!
2022 యమహా MT15 వీ2.0 బైక్‌ వీవీఏ టెక్నాలజీతో కూడిన 155cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను పొందింది. ఈ బైక్‌ 10,000rpm వద్ద 18.4 PS శక్తిని, 7,500rpm వద్ద 14.1 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేయనుంది. స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ బైక్‌ డ్యూక్‌ 125కు పోటీగా నిలుస్తోందని కంపెనీ ప్రకటించింది. MT15 కొత్త-తరం వెర్షన్‌ను రూ. 1.6 లక్షల ప్రారంభ ధరకు (ఎక్స్-షోరూమ్) లభించనుంది.

చదవండి: మారుతి జోరులో టాటా పంచ్‌లు !?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top