విద్యార్థులందరికీ కిట్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులందరికీ కిట్‌ తప్పనిసరి

Nov 6 2026 12:38 AM | Updated on Nov 6 2026 12:38 AM

దమ్మపేట: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులందరికీ ప్రభుత్వం సమకూర్చిన కిట్లు అందేలా వార్డెన్లు శ్రద్ధ వహించాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్‌ ఆదేశించారు. దమ్మపేటలోని గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని గురువారం తనిఖీ చేసిన ఆయన వసతి గదులు, హాస్టల్‌ ఆవరణను పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హాస్టల్‌ ఆవరణలో నీరు నిలిచిందని, పాత భవనం కావడంతో గోడలకు చెమ్మ వచ్చి షాక్‌ వస్తోందని వార్డెన్‌ చెప్పగా, తాత్కాలిక మరమ్మతులు చేయించాలని ఏఈని ఆదేశించారు. కొత్త భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఆ తర్వాత విద్యార్థులతో మాట్లాడిన పీఓ కిట్‌ అందిందా అని ఆరా తీశారు. అలాగే, ఆధార్‌ అనుసంధానం, ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ నమోదుపై సూచనలు చేశారు. వాగులు, కాల్వల వద్దకు పిల్లలను అనుమతించొద్దని, రాత్రిపూట బయటకు వెళ్లకుండా చూడాలని వార్డెన్‌కు సూచించారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ మధుకర్‌, డీఈ బాపనయ్య, ఏఈ సుబ్బరాజు, వార్డెన్‌ కృష్ణబాబు పాల్గొన్నారు.

గిరిజన విద్యార్థులకు గ్లోబల్‌ స్కిల్స్‌

భద్రాచలంటౌన్‌: గిరిజన విద్యార్థుల్లో గ్లోబల్స్‌ స్కిల్స్‌ పెంపొందిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ తెలిపారు. ఖమ్మం, దమ్మపేట, కొత్తగూడెం, మణుగూరు గురుకుల డిగ్రీ కళాశాలలకు చెందిన 225 మంది విద్యార్థులను ఎంపిక చేసి డిజిటల్‌ మార్కెటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించారు. డాటా ప్రో కంప్యూటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో గత ఆగస్టు 28 నుంచి అక్టోబర్‌ 7 వరకు శిక్షణ కొనసాగింది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి గురువారం పీఓ సర్టిఫికెట్లు అందించి మాట్లాడారు. ఆర్‌సీఓ అరుణకుమారి, కళాశాలల ప్రిన్సిపాళ్లు రజిని, స్పందన, అనురాధ, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement