అశ్వారావుపేట: అశ్వారావుపేట ప్రాంతంలో నూతన సబ్ స్టేషన్లు, కార్యాలయ భవనాల నిర్మాణాలు వేగవంతం చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సూచించారు. అశ్వారావుపేటలో నిర్మించతలపెట్టిన విద్యుత్ డివిజన్ కార్యాలయ భవనానికి స్థలాన్ని , అశ్వారావుపేట పరిసర ప్రాంతాల్లోని పలు విద్యుత్సబ్ స్టేషన్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధిలోని నందమూరి కాలనీలో నిర్మిస్తున్న 220/132, 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఉన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్రెడ్డి


